Ileana Tollywood Re entry: గోవా హాట్ బ్యూటీ ఇలియానా మరోసారి టాలీవుడ్‌కు వస్తోంది. బాలీవుడ్‌లో అదృష్టం వరించకపోవడంతో తెలుగు పరిశ్రమలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా మాస్ రాజా రవితేజ సరసన నటించేందుకు సిద్ధమైందని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీర్చిదిద్దినట్టుండే నడువొంపుల వయ్యారి, గోవా బ్యూటీ ఇలియానా తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటి. దేవదాస్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా..నడుం ఒంపులకే యూత్ మొత్తం ఫిదా అయింది. అందంతో పాటు అభినయం తోడవడంతో ఇక తెలుగులో అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. తక్కువ కాలంలోనే అగ్రనటి స్థాయికి చేరుకుంది. అయితే కొద్దికాలం తరువాత తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో..బాలీవుడ్‌కు పయనమైంది. 


బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. అవకాశాల కోసం సోషల్ మీడియాలో హాట్‌హాట్ ఫోటోలతో తెగ రెచ్చిపోయింది కూడా. అయితే ఆశించినంతగా అక్కడ అవకాశాలు లభించలేదనే చెప్పాలి. దాంతో తిరిగి టాలీవుడ్ వైపు చూస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె సహ నటుడు మాస్ రాజా రవితేజ..ఇలియానాను సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో రవితేజ-ఇలియానాలది హిట్ పెయిర్. ఈ ఇద్దరూ కలిసి దేవుడు చేసిన మనుషులు, కిక్, అమర్ అక్బర్ ఆంధోని, ఖతర్నాక్‌లలో నటించారు. ఇందులో కిక్ సూపర్ డూపర్ హిట్‌గా నిలవగా, ఖతర్నాక్ కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ క్రమంలో రవితేజ సరసన మరోసారి నటించి..అదృష్టం పరీక్షించుకునేందుకు ఇలియానా సిద్ధమైందట.


రవితేజ (Raviteja) నటిస్తున్న రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాను శరత్ మండవ తెరకెక్కిస్తున్నాడు. తొలిసారిగా దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్..ఎల్ఎల్పీ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నాడు. పవర్‌ఫుల్ పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్న రవితేజ..ఓ ఐటెమ్ సాంగ్‌కు ఇలియానాను (Ileana) రిఫర్ చేసినట్టు తెలుస్తోంది. రవితేజ సిఫారసుతో ఆ చిత్ర యూనిట్ ఇప్పటికే ఇలియానాను సంప్రదించడం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. మరి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇలియానా కెరీర్‌ను నిలబెడుతుందో లేదో చూడాలి. 


Also read: Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి?.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook