God Father Re shoot Happening in Mumbai on Chiranjeevi -Salman Khan - Satyadev : మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాని తెలుగులో తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయినట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. యూఏ సర్టిఫికెట్ సెన్సార్ సభ్యులు ఇచ్చారని సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా అద్భుతంగా ఉందని కితాబులు ఇచ్చారని కామెంట్లు కూడా మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి.


అయితే తాజాగా అందుతున్న మరో సమాచారం ఏమిటంటే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ మళ్లీ జరుగుతుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కాంబినేషన్లో కొన్ని సీన్లు షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇది రీ షూట్ చేస్తున్నారా? లేక కొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా? అనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. నిజానికి సెన్సార్ పూర్తయిన తర్వాత రీషూట్ చేసి ఏదైనా సీన్ యాడ్ చేస్తే నిబంధనలు ఒప్పుకోవు, దానిని మళ్లీ సెన్సార్ కి పంపించాల్సి ఉంటుంది.


అలా పంపకపోతే కనుక అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. అయితే అంత రిస్క్ తీసుకోవడానికి కూడా గాడ్ గాడ్ ఫాదర్ టీం సిద్ధమైందంటే ఏదో తేడాగానే ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో గాడ్ ఫాదర్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత ప్రొడక్షన్ కావడంతో సినిమా విషయంలో రిస్కు తీసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి కానీ రామ్ చరణ్ గానీ సిద్ధంగా లేరని తెలుస్తోంది.


సినిమాకు భారీగా ఆఫర్లు వస్తున్నాయని సుమారు 200 కోట్ల రూపాయల మేర హక్కులు అమ్మేశారని మీడియాలో ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేరని, దీంతో సినిమా నిర్మాత ఎన్వి ప్రసాద్ అడ్వాన్స్ విధానంలో సినిమా విడుదల చేయడానికి సిద్ధమయ్యారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. సినిమా సెన్సార్ కూడా పూర్తి అయిన తర్వాత మళ్లీ రీ షూట్ కి వెళ్ళింది అనే విషయం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒకవర్గం మాత్రం ఏదైనా ప్రమోషనల్ వీడియో షూట్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గాడ్ ఫాదర్ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాల్సి ఉంది. 


Also Read: GodFather: సెన్సార్ అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంస.. గాల్లో తేలిపోతున్న గాడ్‌ఫాదర్‌ డైరెక్టర్!


Also Read: Alluri Movie Review : శ్రీవిష్ణు అల్లూరి సినిమా ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook