GodFather: సెన్సార్ అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంస.. గాల్లో తేలిపోతున్న గాడ్‌ఫాదర్‌ డైరెక్టర్!

Chiranjeevi's GodFather Movie Censor Completes. గాడ్‌ఫాదర్‌ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందిందని డైరెక్టర్ మోహన్‌రాజా తెలిపారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 23, 2022, 07:19 PM IST
  • సెన్సార్ అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంస
  • గాల్లో తేలిపోతున్న గాడ్‌ఫాదర్‌ డైరెక్టర్
  • అక్టోబరు 5న విడుదల
GodFather: సెన్సార్ అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంస.. గాల్లో తేలిపోతున్న గాడ్‌ఫాదర్‌ డైరెక్టర్!

Megastar Chiranjeevi's GodFather Movie gets U/A certificate says Mohan Raja: డైరెక్టర్ మోహన్‌రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ఫాదర్‌’. బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌, స్టార్ హీరోయిన్ నయనతార, హీరో సత్యదేవ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న గాడ్‌ఫాదర్‌ చిత్రం  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదలకు సిద్ధంగా ఉంది. గాడ్‌ఫాదర్‌ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది.

గాడ్‌ఫాదర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల మేకర్స్‌ 'తార్ మార్ టక్కర్ మార్' అనే సాంగ్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది. సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందిందని డైరెక్టర్ మోహన్‌రాజా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'గాడ్‌ఫాదర్‌ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. సెన్సార్ అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి' అని డైరెక్టర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 

గాడ్‌ఫాదర్‌ నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, టీజర్‌, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా హీరో చిరంజీవి చెప్పిన డైలాగ్  సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోహన్‌ లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటించిన మలయాళ హిట్‌ సినిమా ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ తెరకెక్కింది. మలయాళంలో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌ ఖాన్ పోషించారు. చిరంజీవి చెల్లి పాత్రలో నయనతార కనిపించనున్నారు. విలన్ పాత్రలో సత్యదేవ్‌ నటించారు. 

Also Read: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. కెమెరాలో చిక్కిన అరుదైన దృశ్యం! అస్సలు నమ్మలేరు

Also Read: నాగుపాము తల నుంచి 2 నాగమణులను తీసిన వ్యక్తి.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News