Golden Globe Awards 2022: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటిన `ది పవర్ ఆఫ్ ది డాగ్`, `వెస్ట్ సైడ్ స్టోరీ` చిత్రాలు!
Golden Globe Awards: 2022 సంవత్సరానికి సంబంధించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేతలను ప్రకటించారు. విల్ స్మిత్, జెరెమీ స్ట్రాంగ్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.
Golden Globes 2022 full winners list: ఈ ఏడాదికి సంబంధించిన 79వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల (79th Golden Globe Awards) విజేతలను ఆదివారం రాత్రి (జనవరి 9) ట్విట్టర్ లో ప్రకటించారు. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ విజేతల పూర్తి జాబితాను విడుదల చేసింది. మోషన్ పిక్చర్ విభాగంలో విల్ స్మిత్ (Will Smith) ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకోగా, టెలివిజన్ సిరీస్ విభాగంలో జెరెమీ స్ట్రాంగ్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు. పోజ్ స్టార్ ఎంజే రోడ్రిగ్జ్ (Mj Rodriguez) గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి ట్రాన్స్ జెండర్ నటి.
Also Read:Sid Sriram: కొత్త అవతారం ఎత్తనున్న స్టార్ సింగర్.. ఏకంగా మణిరత్నం సినిమాలో ఛాన్స్!!
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేతల జాబితా:
* బెస్ట్ మోషన్ పిక్చర్- డ్రామా (Best motion picture — drama): ది పవర్ ఆఫ్ ది డాగ్ (The Power of the Dog)
* ఉత్తమ నటుడు మోషన్ పిక్చర్-డ్రామా (Actor in a motion picture — drama): విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
* ఉత్తమ నటి మోషన్ పిక్చర్-డ్రామా (Actress in a motion picture — drama): నికోల్ కిడ్మాన్ ("బీయింగ్ ది రికార్డోస్")
* ఉత్తమ చలన చిత్రం - మ్యూజికల్ లేదా కామెడీ (Best motion picture — musical or comedy): వెస్ట్ సైడ్ స్టోరీ (West Side Story)
* ఉత్తమ నటుడు- మ్యూజికల్ లేదా కామెడీ (Actor in a motion picture — musical or comedy): ఆండ్రూ గార్ఫీల్డ్ ("టిక్, టిక్...బూమ్!")
* ఉత్తమ నటి- మ్యూజికల్ లేదా కామెడీ (Actress in a motion picture — musical or comedy): జెన్నిఫర్ లారెన్స్ (డోంట్ లుక్ ఆఫ్)
* సహాయ నటుడు-మోషన్ పిక్చర్ (Supporting actor in a motion picture): కోడి స్మిట్-మెక్‌ఫీ ("ది పవర్ ఆఫ్ ది డాగ్")
* సహాయ నటి-మోషన్ పిక్చర్ (Supporting actress in a motion picture): అరియానా డిబోస్ ("వెస్ట్ సైడ్ స్టోరీ")
* డైరెక్టర్- మోషన్ పిక్చర్ (Director — motion picture): జేన్ కాంపియన్ ("ది పవర్ ఆఫ్ ది డాగ్")
* స్క్రీన్ ప్లే-మోషన్ పిక్చర్ (Screenplay — motion picture): బెల్ఫాస్ట్ (Belfast)
* మోషన్ పిక్చర్-విదేశీ భాష (Motion picture — foreign language): "డ్రైవ్ మై కార్" (రైసుకే హమగుచి, జపాన్)
* మోషన్ పిక్చర్ - యానిమేటడ్ (Motion picture — animated): ఎన్కాంటో
* ఒరిజినల్ స్కోర్- మోషన్ పిక్చర్ (Original score — motion picture):
* ఒరిజినల్ సాంగ్- మోషన్ పిక్చర్ (Original song — motion picture): ''నో టైమ్ టు డై" ఫ్రమ్ "నో టైమ్ టు డై"
* బెస్ట్ టెలివిజన్ సిరీస్-డ్రామా (Television series — drama): సక్సెసన్“(Succession”)
* ఉత్తమ నటుడు- టెలివిజన్ సిరీస్ (Actor in a television series — drama): జెరెమీ స్ట్రాంగ్ (సక్సెసన్“మూవీ)
* ఉత్తమ నటి-టెలివిజన్ సిరీస్ (Actress in a television series — drama); మైఖేలా జే రోడ్రిగ్జ్ (పోజ్)
* బెస్ట్ టెలివిజన్ సిరీస్-మ్యాజికల్ లేదా కామెడీ (Television series — musical or comedy): “హక్స్ (Hacks”)
* ఉత్తమ నటుడు- టెలివిజన్ సిరీస్-మ్యాజికల్ లేదా కామెడీ (Actor in a television series — musical or comedy): జాసన్ సుడెకిస్ (టెడ్ లాస్సో)
* ఉత్తమ నటి- టెలివిజన్ సిరీస్-మ్యాజికల్ లేదా కామెడీ (Actress in a television series — musical or comedy) : జీన్ స్మార్ట్ (హాక్స్)
* సహాయ నటుడు- టెలివిజన్ సిరీస్ (Supporting actor — television): ఓ యోంగ్-సు (స్క్విడ్ గేమ్)
* సహాయ నటి- టెలివిజన్ సిరీస్ (Supporting actress — television): సారా స్నూక్ (సక్సెసన్)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook