నటీనటులు : అడివి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫి : షానిల్ డియో
మాటలు : అబ్బూరి రవి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సహ నిర్మాత : వివేక్ కూచిభోట్ల
నిర్మాతలు : అభిషేక్ నామా, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
కథ : అడివి శేష్
దర్శకత్వం : శశికిరణ్ తిక్క.
నిడివి : 147 నిమిషాలు
విడుదల తేదీ : 3 ఆగస్ట్ 2018


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘క్షణం’ తర్వాత రెండేళ్ళు టైం తీసుకున్న అడివి శేష్ ‘గూఢచారి’ సినిమాతో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘స్పై’ కాన్సెప్ట్‌తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో అడివి శేష్ & టీం హిట్టు అందుకుంటుందా ? టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ఏ మేరకు ఆడియెన్స్‌ని అలరించింది ? జీ సినిమాలు ఎక్స్‌క్లూజివ్ రివ్యూ.


కథ :
త్రినేత్ర అనే రా ఏజెన్సీలో ట్రైనింగ్ తీసుకొని ఏజెంట్‌గా మారిన అర్జున్ (అడివి శేష్) ఎప్పటికైనా తన తండ్రిలా దేశాన్ని కాపాడాలనుకుంటాడు. చిన్నతనం నుండి సత్య (ప్రకాష్ రాజ్) దగ్గర పెరిగిన అర్జున్ తన ధైర్య సాహసాలతో త్రినేత్ర ట్రైనింగ్‌లో అన్నిటిలో బెస్ట్ అనిపించుకుంటాడు. అదే సమయంలో అర్జున్‌కి సమీర (శోభిత ధూళిపాళ) పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్దిరోజులకే ఇద్దరు బాగా దగ్గరై ప్రేమలో పడతారు. అయితే ఊహించని విధంగా ఓరోజు అర్జున్‌పై కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో ప్రేయసి సమీరను కోల్పోతాడు అర్జున్. సరిగ్గా అదే సమయంలో త్రినేత్ర టీంలో కీలక వ్యక్తులు ఆచార్య, దామోదర్ (అనిష్ కురివిల్ల) హత్యకు గురవుతారు.


ఆ హత్యలో అర్జున్‌ని కావాలని ఇరికిస్తారు. ఆ సమయంలో అర్జున్‌కి కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయి. హత్య కేసు నుండి బయటపడే క్రమంలో అర్జున్‌కి సహకరిస్తుంది త్రినేత్ర ఏజెంట్ లీన (మధు శాలిని). ఆ టైంలో స్కెచ్ వేసి మరీ అర్జున్‌ను కలుస్తాడు టెర్రరిస్ట్ రానా(జగపతి బాబు). రానా ద్వారా తన తండ్రి రఘువీర్ గురించి అప్పటివరకూ తెలియని ఓ నిజం తెలుసుకుంటాడు అర్జున్. ఇంతకీ అర్జున్ తండ్రి ఎవరు ? అర్జున్‌కి రానాకి సంబంధం ఏమిటి ? అసలు త్రినేత్ర టీంలో కీలక వ్యక్తులను హత్య చేసి అర్జున్‌ని ఇరికించిందెవరు ? చివరికి ఆ కేసు నుండి అర్జున్ ఎలా బయటపడ్డాడు అనేదే ‘గూఢచారి’ కథ.


[[{"fid":"172295","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
 
నటీనటుల పనితీరు :
ఇప్పటివరకూ చేసిన ప్రతీ పాత్రలో ఒదిగిపోయి నటించిన అడివి శేష్ అర్జున్ అనే గూఢచారి క్యారెక్టర్‌కి బెస్ట్ అనిపించాడు. సినిమా మొదలైనప్పటి నుంచి శుభం కార్డ్ పడే వరకూ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం అతడు పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగమ్మాయి శోభిత కనిపించింది తక్కువసేపే అయినప్పటికీ సమీరా రోల్‌కి సరిగ్గా ఫిట్ అయింది. ప్రకాష్ రాజ్ తన పాత్రకి ఎప్పటిలాగే పర్ఫెక్ట్ అనిపించాడు.


ప్రస్తుతం రెగ్యులర్ విలన్‌గా కాస్త బోర్ కొట్టిస్తున్న జగపతి బాబు టెర్రరిస్ట్‌గా కనిపించినప్పటికీ ఆ క్యారెక్టర్‌కి బెస్ట్ అనిపించుకోలేకపోయాడు. నటిగా కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన సుప్రియకి మంచి క్యారెక్టర్ దొరికింది. వెన్నెల కిషోర్ రెగ్యులర్ కామెడి రోల్ కాకుండా ఈసారి కొత్తగా కనిపించి మెప్పించాడు. అనిష్ కురివిల్ల, మధు శాలిని, రాకేశ్ తదితరులు క్యారెక్టర్స్‌కి పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నారు.
 
టెక్నీషియన్స్ పనితీరు :
కొన్ని సినిమాలకు మాత్రమే ఆర్టిస్టులతో పాటు తెరపై టెక్నిషియన్స్ వర్క్ కూడా కనిపిస్తుంది. అలా ఈ సినిమాకు సంబంధించి ఓ ముగ్గురు స్క్రీన్‌పై కనిపించారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఎడిటర్ గ్యారీ BH గురించి. సినిమా అంతా తన ఎడిటింగ్‌తో కనిపించాడు. ఇలాంటి సినిమాలకు ఎడిటింగ్ పర్ఫెక్ట్‌గా కుదరకపోతే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. అది దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో కానీ సినిమాకి పర్ఫెక్ట్ కట్ ఇచ్చాడు. ఎడిటింగ్ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించే. షానిల్ డియో సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్. ముఖ్యంగా అతని కోణంలో సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది. 


శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎస్సెట్. కొన్ని సన్నివేశాల్లో అతని ఆర్.ఆర్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. అలాగే సౌండ్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్ కూడా సినిమాలో కీలకంగా నిలిచాయి. అడివి, రాహుల్, శశి స్క్రీన్ ప్లే ఇంటరెస్టింగ్‌గా ఉంది. అబ్బూరి రవి అందించిన కొన్ని మాటలు ఆకట్టుకున్నాయి. కొత్త దర్శకుడైనప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను డీల్ చేసాడు శశి.


 


కెరీర్ స్టార్టింగ్ హీరోగా అలాగే దర్శకుడిగా ఫెయిల్ అయిన అడివి శేష్ ఇటివలే ‘క్షణం’ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడిగా ఫెయిల్ అయినప్పటికీ రచయితగా, నటుడిగా మాత్రం ప్రస్తుతం మంచి ఇమేజ్ అందుకుంటున్నాడు శేష్. ముఖ్యంగా ‘క్షణం’ తర్వాత వెంటనే మరో సినిమా చేయకుండా అతను తీసుకున్న జాగ్రత్తలు, ఈ సినిమా కోసం రెండేళ్ళు కేటాయించిన సమయం శేష్‌కు సినిమాపై ఉన్న డెడికేషన్ ఏంటో తెలియజేస్తాయి.
దర్శకుడు శశి & రాహుల్‌తో కలిసి శేష్ రాసుకున్న ట్విస్టులు, సీన్స్ స్క్రీన్ ప్లే పరంగా బాగా ఆకట్టుకున్నాయి. 


కేవలం ఒక హీరోగా సినిమా చేసి అంతటితో తన పని పూర్తయిందని భావించే రకం హీరో శేష్ కాదు కనుక ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో ఏదో రకంగా ఇన్వాల్వ్ అయ్యాడనే విషయం సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక బెస్ట్ ప్రొడక్ట్ కోసం హీరో ఇలా ఇన్వాల్వ్ అవ్వడం మంచిదే.. దర్శకుడు శశి కిరణ్‌కి మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిలా డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది.


రా ఏజెన్సీ కాన్సెప్ట్‌తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్. ఎక్కడా బోర్ కొట్టకుండా మొదటి నుంచి చివరి వరకు అదే ఆసక్తితో ముందుకు సాగుతుంది సినిమా. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి. కాకపోతే అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయినట్టు తెలిసిపోతుంది. ఇక కథ -స్క్రీన్ ప్లేతో పాటు డైరెక్షన్, అడివి శేష్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్టులు సినిమాకు హైలైట్ కాగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో తండ్రీకొడుకుల మధ్య సాగే డ్రామా సినిమాకు మైనస్.


అంతిమంగా ‘గూఢచారి’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది.
బాటమ్ లైన్ – మరో ‘గూఢచారి’ దొరికాడు


రేటింగ్ : 3 / 5


జీ సినిమాలు సౌజన్యంతో...