Bhimaa First Day Collections: గోపీచంద్.. భారీ కటౌట్ కలిగిన మంచి సాలిడ్ మాచో స్టార్. కరెక్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు పడితే హిట్ కొట్టగలిగే హీరో. అయితే గత కొద్ది కాలంగా గోపీచంద్ తన కెరీర్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. మహాశివరాత్రి కానుకదా శుక్రవారం నాడు గోపీచంద్ భీమా చిత్రం విడుదలైంది. ఈ మూవీ తో ఎలాగైనా సక్సెస్ సాధించి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలి అని గోపీచంద్ కోరిక.ఇక ఈ మూవీ కి సంబంధించి డే వన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకొని చిత్రంపై అంచనాలు భారీగా పెంచింది. కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈ మూవీ లో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.మహావిష్ణువు దశావతారాల్లో పరశురాముడి అవతారం కూడా ఒకటి. మన పురాణాల్లో పరశురాముడి ఆధారంగా ఈ కథ క్రియేట్ చేశారు. పోలీస్ బ్యాక్ డ్రాప్ తో సాగే భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘భీమా’.


విడుదలకు ముందు నుంచే ఈ చిత్రానికి బాగా బజ్ క్రియేట్ అవ్వడంతో భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే మొదటి షో నుంచి ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇప్పటివరకు గోపీచంద్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ స్క్రీన్స్ లో ఈ మూవీ ని విడుదల చేశారు. నైజాం, ఆంధ్ర మొత్తానికి కలిపి ఈ చిత్రం 600 స్క్రీన్ల పై విడుదల కాగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100 స్క్రీన్ లు.. ఓవర్సీస్ లో మరొక 200 స్క్రీన్ లపై ఈ మూవీ ను ప్రదర్శించారు.


మరి ఊహించినంత కలెక్షన్స్ రాకపోయినా ఈ మూవీకి మొదటి రోజు డీసెంట్ వసూళ్లే వచ్చాయి. యువసేన పాటు ఇతర ప్రాంతాలలో మొదటిరోజు ఈ చిత్రం రూ.1.25 కోట్లు వసూలు చేసింది. మీరు తెలుగు రాష్ట్రాలలో సుమారు రూ.1.30 కోట్లు ఈ మూవీ ఖాతాలో పడ్డాయి. మొత్తం అన్ని ఏరియాలకు కలిపి ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ 3 కోట్లు చేరుకున్నాయి.. వీకెండ్ కలిసి రావడం తో పాటు ఎక్కువ స్క్రీన్ లపై ప్రదర్శించడం ఈ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ 25 కోట్లు. ఇంకో వారం వరకు ఇదే రేంజ్ కలెక్షన్స్ రాబట్టగలిగితే ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది.


Also Read: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!


Also Read: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..



 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter