OTT Theatre Movie ఓటీటీలు, థియేటర్లు ఇలా ఎక్కడ కొత్త సినిమా వచ్చినా కూడా జనాలు చూస్తూనే ఉన్నారు. ఒక వేళ థియేటర్లో బాగా ఆడి.. క్రేజ్ వచ్చిన సినిమాలను చూడటం మిస్ అయిన వారు.. ఓటీటీ రిలీజ్ కోసం ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీలో ఎక్కువ బజ్‌ను క్రియేట్ చేసిన తెలుగు సినిమాలేవీ రిలీజ్ అవ్వడం లేదు. థియేటర్లో మాత్రం రెండు పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ వారం థియేటర్ వద్ద మంచి పోటీ నెలకొనేలా కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రామబాణం రాబోతోంది. లక్ష్యం, లౌక్యం తరువాత రామబాణం అంటూ రాబోతోన్నారు. ఇందులో డింపుల్ హయతీ హీరోయిన్‌గా నటించింది. లక్ష్యం సినిమాలో జగపతి బాబు కూడా నటించాడు. ఇప్పుడు రామబాణంలోనూ నటించాడు. ఇక ఇన్ని సెంటిమెంట్లు ఉండటంతో సినిమా హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. మే 5న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. మరి వీరి హ్యాట్రిక్ సినిమా హిట్టువుతందా? లేదా? అన్నది చూడాలి.


ఇక అల్లరి నరేష్ ఉగ్రం అంటూ అందరినీ యాక్షన్స్‌తో భయపెట్టేందుకు వస్తున్నాడు. నాంది సినిమాలో సీరియస్ పాత్రను చేశాడు. ఇక ఇందులో అయితే పవర్ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఇందులో రక్తపాతం ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద ఈ కథ నడుస్తుందని అర్థం అవుతోంది. ఈ సినిమా మే 5న థియేటర్లోకి రానుంది.


Also Read:  Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి


నెట్ ఫ్లిక్స్‌లో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమా ఐదో తేదిన రానుంది. అయితే ఈ సినిమా థియేటర్లో ఆడలేక డిజాస్టర్‌గా నిలిచింది. ఈటీవీ విన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఐదో తేదీనే స్ట్రీమింగ్ కానుంది. ఇక తెలుగు సినిమాలేవీ కొత్తగా ఓటీటీలోకి రావడం లేదు. అంతగా బజ్ క్రియేట్ చేసిన హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా లిస్ట్‌లో లేవు.


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook