Ramabanam : రామబాణం థియేటర్ కౌంట్.. బ్రేక్ ఈవెన్ ఎంత, బిజినెస్ ఎంత జరిగిందంటే?
Gopichand Ramabanam Business గోపీచంద్ రామబాణం సినిమాతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. లక్ష్యం, లౌక్యం తరువాత శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో ఈ సినిమా రాబోతోండటంతో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ వివరాలు వైరల్ అవుతున్నాయి.
Gopichand Ramabanam Business యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన రామబాణం చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందింది. గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో ఇప్పటికే లక్ష్యం లౌఖ్యం సినిమాలు విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో రామబాణం చిత్రం వీరి కాంబోకు హ్యాట్రిక్ గా నిలుస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా అదే నమ్మకంతో ఉన్నారు.
షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యి విడుదల ఆలస్యం అయ్యింది. షూటింగ్ సందర్భంగా హీరో గోపీచంద్ దర్శకుడు శ్రీవాస్ మధ్య విభేదాలు తలెత్తాయి అనే ప్రచారం కూడా జరిగింది. అది నిజమే కానీ పెద్ద గొడవలు కాదు అన్నట్లుగా హీరో గోపీచంద్ క్లారిటీ ఇచ్చాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాకు పెద్ద హీరోల సినిమాలు పోటీ లేకపోవడంతో భారీ ఎత్తున థియేటర్లు లభించబోతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న బాక్సాఫీస్ సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో ఈ సినిమాను దాదాపుగా 210 స్క్రీన్స్ లో మొదటి రోజు స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇక సీడెడ్ లో 110 థియేటర్లలో స్క్రీనింగ్ కు ఏర్పాట్లు జరిగాయి. ఆంధ్రా లో దాదాపుగా 300 థియేటర్లలో సినిమాను స్క్రీనింగ్ కు ఏర్పాట్లు చేయడం జరిగింది. కర్ణాటక దేశంలోని ఇతర ప్రాంతాల్లో కలిపి 60 స్క్రీన్స్ లో ఇంకా ఓవర్సీస్ లో దాదాపుగా 160 స్క్రీన్స్ లో స్క్రీనింగ్ చేసేందుకు బుక్ చేశారు.
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 840 స్క్రీన్స్ లో మొదటి రోజు స్క్రీనింగ్ చేయబోతున్నారు. మొదటి రోజు ఈ స్థాయిలో స్క్రీనింగ్ జరగడం కచ్చితంగా గొప్ప విషయం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారం మొత్తం ఇదే సంఖ్యలో స్క్రీన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతో భారీ కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక హిట్ కాంబో అవ్వడంతో పాటు పీపుల్స్ మీడియా వారు ఈ సినిమాని నిర్మించడం వల్ల బయ్యర్లు కొనుగోలుకు ఆసక్తి చూపించారు.
Also Read: samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14.50 కోట్లుగా చెబుతున్నారు. ఏపీ మరియు నైజాం ఏరియాలో సాలిడ్ మొత్తాలకు ఈసినిమా అమ్మడు పోయింది. 15.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వస్తే మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామబాణం సినిమాతో చాలా కాలంగా అందని కమర్షియల్ సక్సెస్ ను గోపీచంద్ దక్కించుకుంటాడనే నమ్మకంను ఆయన అభిమానులు మరియు రామబాణం యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. రామబాణం టైటిల్ ను నందమూరి బాలకృష్ణ సూచించడం జరిగింది. ఆ విషయం కూడా గోపీచంద్ కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook