Govinda suffers bullet injury at home in Mumbai: ఫెమస్ నటుడు గోవిందా  కాలికి గాయమైంది. ఆయన ముంబైలోని తన ఇంట్లో ఉండగా.. గన్ మిస్ ఫైర్ అయ్యినట్లు తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4.45 గంటలకు అతని లైసెన్స్‌డ్ రివాల్వర్ నుండి మిస్ ఫైర్ కావడంతో గాయం అయ్యినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

60 ఏళ్ల నటుడు, శివసేన నాయకుడు కూడా సంఘటన జరిగిన సమయంలో తన జుహు ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన మెనెజర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపైన ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలంగా మారింది. దీనిపై బాలీవుడ్ వర్గాల్లో తీవ్రఆందోళన నెలకొంది.  


మంగళవారం రోజు ఉదయం ఆయన తన ఇంటి నుంచి కోల్ కతాకు వెళ్తుండగా.. లైసెన్స్ డ్ రివాల్వార్ తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తుపాకీ పేలి.. ఒక బుల్లెట్ గోవిందా కాళ్లలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయనను సిబ్బంది  ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.


Read more: Sobhita Dhulipala: ఓర్ని.. ఇదేం విడ్డూరం.. పెళ్లి కాకుండానే.. బేబి బంప్‌తో షాకిచ్చిన నాగార్జున కోడలు..?..


 మరోవైపు 1963 లో జన్మించిన గోవిందా.. ఫెమస్ సీరియల్ అయిన మహాభారత్ లో అభిమాన్య పాత్ర కోసం తొలిసారిగా ఆడిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  తాన్ బదన్ మూవీతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుస విజయాలతో సినిమా రంగంలో దూసుకుపోయారు. 1991 గోవిందా.. అమితాబ్, రజనీకాంత్ లతో కలిసి హమ్ మూవీలో నటించారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.