Sobhita Dhulipala: ఓర్ని.. ఇదేం విడ్డూరం.. పెళ్లి కాకుండానే.. బేబి బంప్‌తో షాకిచ్చిన నాగార్జున కోడలు..?..

Sobhita Dhulipala: నాగచైతన్యకు శోభితా ధూళిపాళకు ఇటీవల ఎంగెజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా శోభితా ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా, ఇప్పుడు శోభితా బేబీ బంప్ తో దర్శనమిచ్చారు.

1 /8

అక్కినేని నాగార్జున కొడుకు చైతుకు, శొభితా దూళిపాళకు కొన్ని రోజుల క్రితమే గ్రాండ్ గా ఎంగెజ్ మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో నాగార్జున తన ఎక్స్ ఖాతాలో వీరి ఎంగెజ్ మెంట్ ఫోటోలను సైతం షేర్ చేసి బ్లెస్సింగ్ ఇచ్చారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు.

2 /8

అయితే.. వీరి ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి ఏదో ఒక సెన్సెషన్ తో శొభితా వార్తలలో ఉంటున్నారు. మరోవైపు వేణుస్వామి వీరి వివాహా బంధంపై అప్పుడు లేనీ పోనీ వీడియోలు తీసి, వీరిద్దరు కూడా డైవర్స్ తీసుకుంటారని బాంబు పేల్చారు. ఇది కాస్త రచ్చగా మారింది.

3 /8

అదే విధంగ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన తర్వాత కూడా కొంత మంది శొభితాను ఆడిపోసుకున్నారు. మరోవైపు శోభితా మాత్రం.. గోకులాష్టమి పండుగ చేసుకుంటూ ఫుల్ చిల్ అయ్యారు. ఇదివల ఒక ఇంటర్వ్యూలో శొభితా చేసిన వ్యాఖ్యలు సైతం ఫుల్ గా వైరల్ గా మారాయి.

4 /8

ఎంగేజ్ మెంట్, పెళ్లి పై శోభితా.. తాను ఎప్పుడు కూడా ఇలా జరుగుతుందని,పిల్లల్ని కనడంపైన కూడా ఇలానే అని ప్లాన్ లుచేయలేదని సరదాగా మాట్లాడారు . అదే విధంగా తనకు సంప్రదాయాలంటే ఎంతో ఇష్టమని, తన ఎంగెజ్ మెంట్ కూడా అలానే జరిగిందని కూడా శొభితా చెప్పుకొచ్చాురు.

5 /8

కానీ కొంత మంది మాత్రం దీన్ని కూడా ట్రోల్ చేశారు. శోభితాకు పిల్లల్ని కనడం ఇష్టంలేదన్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరించారు. దీంతో శోభితా వార్తలలో నిలిచారు. తాజాగా, మరోసారి శోభితా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

6 /8

కొంత మంది పెళ్లికి ముందే నాగచైతన్యకు కాబోయే భార్య..బేబీ బంప్ ఏంటని కూడా వింతగా చూస్తున్నారు. అయితే.. ఇక్కడే చాలా మంది రసంలో కాళ్లేశారు. ఈ బేబీ బంప్ ఫోటోలు ఆమె నటించిన లవ్ సితారామూవీ షూటింగ్ పిక్స్. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

7 /8

ఓటీటీలో.. లవ్ సితార జీ5 స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చింది. అందులో శోభితా బేబీ బంప్ తో కన్పించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలుస్తొంది.  ప్రమోషన్స్ లో భాగంగా.. ఈ ఫోటోలు షేర్ చేసినట్టు తెలుస్తోంది.   

8 /8

ఇది తెలియని చాలా మంది శోభితా దూళిపాల ప్రెగ్నెంట్ అంటూ కూడా రూమర్స్ లను ఎప్పటిలాగే.. కామన్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పిక్స్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారాయి.