Sreeleela Next Movie: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శక ఆధ్వర్యంలో.. విడుదలైన పెళ్లి సందD..సినిమాతో శ్రీలీల తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రీలీల మీద.. ఆఫర్ల వర్షం కురిసింది. దీంతో వచ్చిన ప్రతి ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఈ భామ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి సందD సినిమాతో తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసనా.. ధమాకా సినిమాలో నటించింది శ్రీలీల. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో.. టాలీవుడ్ లో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఆ తరువాత కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా చవిచూసిన శ్రీలీల.  తాజాగా ఇప్పుడు మరొకసారి రవితేజతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు  వినిపిస్తున్నాయి.


తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా లాంచ్ కి హాజరైంది శ్రీ లీల. ఈ వేడుకలో భాగంగా.. ఆమె కట్టుకున్న నారింజరంగు చీర..ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ డిజైనర్ అనిత డోంగ్రి డిజైన్.. చేసిన ఈ నారింజ రంగు చీర హాట్ టాపిక్ గా మారింది.


స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని.. లైట్ ఎంబ్రాయిడరీ తో.. మంచి ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఈ చీరలో..శ్రీ లీల మరింత అందంగా కనిపిస్తోంది. అయితే ఈ చీర ఖరీదు.. తెలుసుకున్న అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు. కాగా శ్రీలీల కట్టుకున్న ఈ అందమైన చీర ఖరీదు అక్షరాల 70 వేల రూపాయలు.


అంత ఖరీదు ఉన్న చీరకి శ్రీలీల.. మరింత అందాన్ని తీసుకువచ్చింది..అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సినిమాల పరంగా చూస్తే శ్రీలీల.. ఈ మధ్యనే భగవంత్ కేసరి.. సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ఆ తరువాత ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో వరుస డిజాస్టర్లు.. అందుకున్న శ్రీ లీల.. గుంటూరు కారంతో.. పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత రవితేజ తో కూడా మరొక సినిమా లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలతో అయినా శ్రీలీల మళ్లీ మంచి హిట్స్ అందుకుంటుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 



Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter