Guntur Kaaram Second Single: అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అందుకే ఈ చిత్రంపై అటు మహేష్ అభిమానులకు ఇటు తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు సినీప్రియలు ఎంతో ఖుషి అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, దమ్ మసాలా అని సాగే ఓ పాటని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇవన్నీ కూడా మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి సెకండ్ పాట రిలీజ్ కాబోతుందని థమన్, నిర్మాత నాగవంశీ, శ్రీలీల హింట్స్ ఇచ్చారు. కానీ ఇంకా విడుదల కాకపోవడంతో మహేష్ అభిమానులు నిన్నటి వరకు నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా గుంటూరు కారం సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చి మరోసారి మహేష్ అభిమానులలో పండగ వాతావరణాన్ని నెలకొల్పారు ఈ సినిమా మేకర్స్.




మహేష్ బాబుకి బుగ్గ పైన హీరోయిన్ శ్రీలీల ముద్దు పెడుతున్న పోస్టర్ ని రిలీజ్ చేసి.. దానితోపాటు అప్డేట్ కూడా ఇచ్చేశాడు. ఓ మై బేబీ అని సాగే పాట ప్రోమో డిసెంబర్ 11న సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు, అలానే ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ పోస్టర్ చూస్తే ఇది ఇది రొమాంటిక్ లవ్ సాంగ్ లా ఉండబోతుందని తెలుస్తుంది. 


ఇక ఈ సినిమాలో శ్రీ లీలాతో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్గా కనిపించనుంది. కాగా ఈ చిత్రం గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?


 


Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook