Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!

Tata Tiago Price: మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో మంచి మైలేజీని ఇచ్చే కార్మికునుగోలు చేయాలనుకుంటే.. మీకోసం ఓ శక్తివంతమైన ఇంజన్ తో కూడిన కారుని పరిచయం చేయబోతున్నాం. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన టాటా టియాగో అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ కారుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 10:37 PM IST
Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!

 

Tata Tiago Price: భారత్‌లో అనేక ఆటో కంపెనీలు లగ్జరీ కార్లను విడుదల చేసినా..చిన్న కార్ల డిమాండ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అనేక మధ్యతరగతి కుటుంబాలున్నాయి. వీరిలో చాలామంది మిడిల్ రేంజ్ బడ్జెట్లో కలిగిన కార్లనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే చాలా ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుతం ఎక్కువగా మిడిల్ రేంజ్ బడ్జెట్ కార్లనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కంపెనీలు కూడా అతి చౌకగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన కార్లను విక్రయించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఇటీవల విడుదలైన చాలా కార్లు శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు అధిక మైలేజీని కలిగి ఉంటున్నాయి. అంతేకాకుండా ఆటో కంపెనీలు కూడా వాహనాల తయారీ, నాణ్యతలో రాజీ పడడం లేదు. ప్రస్తుతం చాలామంది కార్లను కొనుగోలు చేసే క్రమంలో ఎక్కువగా సేఫ్టీ ఉండే వాటికే మొగ్గు చూపుతున్నారు. అయితే మీరు కూడా మంచి మైలేజీని అందించే మిడిల్ రేంజ్ బడ్జెట్లో లభించే కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీరు టాటా టియాగో కారు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఇది ఒకటి.

ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన టాటా టియాగో కారు వెనక పార్కింగ్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD, ABS, ప్యాసింజర్స్ సెక్యూరిటీ కోసం కంట్రోలింగ్ ఫీచర్స్.. ఇలా అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ కారులో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు 8 శక్తివంతమైన స్పీకర్స్‌తో పాటు మంచి సౌండ్ అందించేందుకు మ్యూజిక్ కంట్రోల్ సిస్టం కూడా అందుబాటులో ఉంది.

ఇక ఈ టాటా టియాగో కారుకు సంబంధించిన ఇంజన్ విషయానికి వస్తే..కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కారు ఇంజన్ శక్తివంతమైన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎక్కువ మైలేజీని అందించేందుకు కంపెనీ ఇటీవలే ఇంజన్ లో మార్పులు చేర్పులను కూడా చేసింది. ఈ కార్ ఇంజన్ 86 BHP శక్తితో 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 19.01 కిమీ మైలేజీని అందించగా..CNG వేరియంట్ 26.49కిమీ మైలేజీకి పైగా ఇస్తుందని సమాచారం.

టాటా టియాగో ధర విషయానికొస్తే..అత్యంత సాధారణ బడ్జెట్లో లభించే కార్లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.60 లక్షల నుంచి రూ. 8.20 లక్షల వరకు ఉంది. ఈ కారు మార్కెట్లో వ్యాగన్ఆర్, సెలెరియో, స్విఫ్ట్ లకు పోటీనిస్తుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News