Hansika Dhee Promo: అల్లు అర్జున్ హీరోగా.. పూరి జగన్నాథ్ రక్షకత్వంలో వచ్చిన సినిమా దేశముదురు. ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించి మనందరినీ మెప్పించిన నటి హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రకారుల హృదయాన్ని తన వైపు తిప్పించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస ఆఫర్లతో బిజీగా మారింది. తమిళవారు ఏకంగా ఈ హీరోయిన్ కి జూనియర్ కుష్బూ అని బిరుదు కూడా ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇక ఈ మధ్యనే తన స్నేహితుడిని పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయిపోయింది ఈ హీరోయిన్. అయితే ఎన్ని రోజులు వెండి తెరను ఏలిన హన్సిక.. త్వరలోనే బుల్లితెరను కూడా ఏలబోతోంది.



ప్రస్తుతం ఎంతోమంది హీరోయిన్స్.. వాళ్ల కెరియర్ చివరి దశకి వచ్చేసరికి.. బుల్లితెర షోలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్.. బుల్లితెరలో జరిగే షోస్ కి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అయిపోయింది హన్సిక.



తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈటీవీ షోల పైన ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈటీవీ వారు ప్రముఖ డ్యాన్స్ షో ఢీ.. ప్రతి సీజన్ లో ఓ కొత్త లేడి జడ్జ్ ని తీసుకువస్తారు. కాగా ఇటీవల ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ అయిపోగా.. ఇప్పుడు మరో కొత్త సీజన్ మొదలవుతుంది. ఈ సారి కూడా సెలబ్రిటీ స్పెషల్ గానే ఢీ షో సాగనుంది అని ఈ మధ్య విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. గత సీజన్ లో హీరోయిన్ ప్రణీతను జడ్జిగా తీసుకురాగా.. ఇప్పుడు ఈ సీజన్ కి హన్సికను జడ్జిగా తీసుకువచ్చారు ఈటీవీ యూనిట్.



గతంలో శ్రియ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఈ షో కి జడ్జీలుగా వ్యవహరించారు. ఇక ఢీ షోలో హన్సిక జడ్జిగా వస్తుందని తెలియడంతో.. ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా హన్సిక ప్రోమోలో సందడి చేసింది. మరో విశేషమేమిటి అంటే హన్సికతో పాటు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ కూడా జడ్జీలుగా ఉన్నారు. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా హన్సిక ఢీ షో ప్రోమో చూసేయండి..
 



 


Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్.


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter