Hansika Motwani Husband : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హన్సిక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత వారం నుంచి హన్సిక పెళ్లి మీద అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఓ పురాతన కోటలో హన్సిక పెళ్లి జరగబోతోందని రూమర్లు వచ్చాయి. అయితే పెళ్లి కొడుకు ఎవరు అన్నదాని మీద ఎవ్వరికీ క్లారిటీ లేకుండా పోయింది. వ్యాపారవేత్తను హన్సిక పెళ్లి చేసుకోనుందనే టాక్ అయితే వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇప్పుడు హన్సిక తనకు కాబోయే భర్తను అందరికీ చూపించింది. తన భర్తే తనకు ప్రపోజ్ చేసినట్టుగా చెప్పేసింది. అది కూడా అక్కడా ఇక్కడా ప్రపోజ్ చేయలేదు. ప్రపంచంలోని ఓ గొప్ప స్థలంలో, అత్యాధునిక కట్టడం ముందు ప్రపోజ్ చేశాడట. వాటికి సంబంధించిన ఫోటోలను హన్సిక షేర్ చేసింది. ఈఫిల్ టవర్ ముందు.. హన్సికకు సినిమాటిక్ స్టైల్లో ప్రపోజ్ చేశాడట.


వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హన్సికకు కాబోయే భర్త పేరు సోహెల్ కథురియా. అతను ఒక వ్యాపారవేత్త. మొత్తానికి ఈ కొత్త జంట మాత్రం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. హన్సిక పెళ్లి మీద గత వారం వచ్చిన రూమర్లే ఇప్పుడు నిజం కాబోతోన్నాయి.


హన్సిక తన భర్తను అందరికీ చూపించేస్తూ ఓ పోస్ట్ వేసింది.ఈ పోస్ట్ మీద టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. కంగ్రాట్స్ అంటూ అనుష్క రెడ్ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. ఓ వావ్.. కంగ్రాట్స్.. నీకు అంతా మంచే జరగాలి అంటూ కుష్బూ కామెంట్ పెట్టేసింది.


ప్రీతమ్, పీవీ సింధు, వరుణ్‌ ధావన్, ఈషా గుప్తా, మంచు విష్ణు భార్య విరానిక ఇలా అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. మొత్తానికి హన్సిక పెళ్లి మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇక పెళ్లి వేదిక, తేదీలకు సంబంధించిన కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ నాలుగో తేదీన, రాజస్థాన్‌లోని కోటలో పెళ్లి జరగబోతోన్నట్టుగా సమాచారం అందుతోంది.


Also Read : Bigg Boss Geetu - Sri Satya : ఊసరవెల్లి గీతూ.. ఎగిరిపడుతున్న సత్య.. ఈ వారం మూడేది ఎవరికి?


Also Read :  సారి లైవ్‌లోకి వచ్చా.. అందరికీ రుణపడి ఉంటా.. రంభ ఎమోషనల్ వీడియో


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook