Actress Rambha Live Video : హీరోయిన్ రంభ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను నిన్న ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రంభ ఫ్యామిలీకి కారు ప్రమాదంలో స్వల్ప గాయాలవ్వడం, రంభ కూతురు సాషా హాస్పిటల్ బెడ్డు మీద పడుకుని ఉండటం, ప్రమాదంలో కారు ధ్వంసం అవ్వడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. తన ప్రస్తుత పరిస్థితి, తన ఫ్యామిలీ పరిస్థితి, తన పాప పరిస్థితిని చెబుతూ, చూపిస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఎమోషనల్ పోస్ట్ వేసింది.
అందరూ తన కూతురి కోసం ప్రార్థించండని వేడుకుంది. ఇక రంభ షేర్ చేసిన పోస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన లభించింది. టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్లంతా కూడా రంభ ఫ్యామిలీకి భరోసానిచ్చారు. సోషల్ మీడియాలో రంభ పోస్ట్‌కు కామెంట్లుపెట్టారు. ధైర్యంగా ఉండమని భరోసానిచ్చారు. రంభ కూతురి కోసం ప్రార్థనలు చేశారు. ఇక రంభ అభిమానులు అయితే కామెంట్లతో, ప్రేమను కురిపించారు. రంభ ఫ్యామిలీ కోసం ప్రార్థించారు.
తన మీద, తన ఫ్యామిలీ మీద ప్రేమను కురిపించిన విధానానికి రంభ ఉబ్బితబ్బిబ్బైపోయింది. తోటి నటీనటులు, అభిమానులు తమ మీద ప్రేమ కురిపించడం చూసి రంభ ఎమోషనల్ అయింది. ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చి తన సంతోషాన్ని ప్రకటించింది. మొదటి సారిగా ఇలా ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చాను.. నా కోసం, నా కుటుంబం కోసం ఎంతో మంది ప్రార్థించారు.. అందరికీ థాంక్స్.. అందరికీ రుణపడి ఉంటాను.. ఇప్పుడు మా ఫ్యామిలీ క్షేమంగా ఉంది.
సాషా కూడా క్షేమంగా ఉంది.. నా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఎంతో మంది మా కోసం ప్రార్థించారు. చాలా ఆనందంగా ఉంది.. అంటూ రంభ ఇలా ఎమోషనల్ అవుతూ వీడియో పెట్టేసింది. అంతే కాకుండా అభిమానుల కామెంట్లను కూడా చదువుతూ మురిసిపోయింది. నేను తెలుగు అమ్మాయిని.. ఆంధ్రలో పుట్టాను, పెరిగాను.. ఎక్కడికి వెళ్తే అక్కడి భాషను నేర్చుకుంటాను.. మాట్లాడుతుంటాను అని ఓ అభిమాని కామెంట్‌కు రిప్లై ఇచ్చింది. ఇలా రంభ మాత్రం ఇప్పుడు తన ఫ్యామిలీ పట్ల కురిపించిన ప్రేమను చూసి మురిసిపోతోంది.
Also Read : UV Productions GST Raids: ప్రభాస్ సొంత సంస్థపై జీఎస్టీ రైడ్స్.. టాలీవుడ్లో కలకలం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook