Hanuman Movie: యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ లో నటించిన చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ ఇవాళ (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్స్ జనవరి 11న పడ్డాయి. దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే హనుమాన్ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సమయంలో చిత్ర యూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించింది. నిన్న ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడికి విరాళంగా ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ప్రదర్శితమైనన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్‌పై రూ.5ను విరాళంగా ఇవ్వనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహారించిన హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తొలి సినిమాగా దీనిని తెరకెక్కించారు. తేజ కెరీర్ లో ఏ సినిమాకు రాని ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వచ్చాయి. పండగ సీజన్ తోపాటు వీకెండ్ వస్తుండటంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. 


Also Read: Hanuman OTT Rights: ఊహించని ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


Also Read: Niti Taylor Pics: బ్లాక్ టాప్ లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న నితీ టేలర్, పిక్స్ వైరల్



.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook