Hanuman Collection Day 1: హనుమాన్ కు సూపర్ హిట్ టాక్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ కు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఊహించని కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి మరి ఈ చిత్రం మాంచి వసూళ్లు సాధిస్తోంది.
Hanuman First day Collections: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే విజువల్స్ ను అందించారు మేకర్స్. రూ. 30 కోట్లతో తీసిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి జనవరి 11న ప్రీమియర్స్ కూడా భారీగానే పడ్డాయి. సంక్రాంతి సెలవులు కావడం, వీకెండ్ వస్తుండటంతో ఈ మూవీ కలెక్షన్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా థియేటర్ల వద్ద హౌస్ పుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు కారం చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో.. ఈ సినిమాకు వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.21 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇండియాలో రూ. 11.91 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమా థియేటర్లు కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృత్ అయ్యర్ హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్ వరలక్ష్మీ, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ చిత్రానికి నార్త్‌లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
Also Read: Guntur Kaaram: యూఎస్ లో గుంటూరు కారంని దాటిన హనుమాన్.. గెలిచిన కథ.. ఓడిన స్టార్ డమ్
మరోవైపు ఈ మూవీ ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్మడుపోయినట్లు తెలుస్తోంది. హనుమాన్ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 16 కోట్ల వెచ్చినట్లు టాక్. ఇందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లుగా తెలుస్తోంది.
Also Read: Saindhav OTT Release: ఆ రెండు ఓటీటీల్లోకి వెంకటేష్ 'సైంధవ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook