Guntur Kaaram: యూఎస్ లో గుంటూరు కారంని దాటిన హనుమాన్.. గెలిచిన కథ.. ఓడిన స్టార్ డమ్

Guntur Kaaram Vs Hanuman: ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. ముందుగా రెండు సినిమాలు జనవరి 12న విడుదలయ్యాయి. వాటిల్లో ఒకటి హనుమాన్ కాగా మరొకటి గుంటూరు కారం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 12:27 PM IST
Guntur Kaaram: యూఎస్ లో గుంటూరు కారంని దాటిన హనుమాన్.. గెలిచిన కథ.. ఓడిన స్టార్ డమ్

Hanuman: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన సినిమా గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12న విడుదల అయింది. తల్లి, కొడుకు సెంటిమెంట్ పైన వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ అనవసరమైన సీన్స్ కి వెళ్లి సినిమాని చాలా దగ్గరలో బోర్ కొట్టించారు అని కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమ్మ సెంటిమెంట్ ఇంకొంచెం ఎక్కువ పెట్టి.. రమ్యకృష్ణ సీన్స్ పెంచి ఉంటే ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అయుంటుంది అనే టాక్ కూడా నడుస్తోంది. మొత్తం పైన కథ ఏమీ లేకుండా ఎక్కువగా హీరోయిన్ హీరోయిజం చూపిస్తూ కథ నడిపేయడం..ఈ చిత్రానికి బాగా నెగిటివ్ పాయింట్ అయ్యింది.

మరోపక్క హనుమాన్ సినిమా మాత్రం.. మంచి కథతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కథ కూడా కొంచెం పాతదే అయిన.. తీసిన విధానం.. ముఖ్యంగా అనవసరమైన సన్నివేశాల జోలికి పోకుండా.. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇలా సంక్రాంతికి విడుదలైన ఈ రెండు చిత్రాలలో.. గుంటూరు కారం ఎక్కువగా స్టార్ డమ్ ని ఉపయోగించుకోవాలి అని చూసి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ ఉండగా.. హనుమాన్ మాత్రం మంచి కథ కథనంతో ముందుకు దూసుకుపోతోంది. దీంతో హనుమాన్ ప్రభావం గుంటూరు కారం పై ఎక్కువగా పడుతోంది.

ముఖ్యంగా మహేష్ బాబుకి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యూఎస్ లో.. సూపర్ హిట్ టాక్ తో హనుమాన్ ఇప్పటివరకు 500k డాలర్లు సంపాదించగా.. గుంటూరు కారం మాత్రం 374k డాలర్లతో సరిపెట్టుకుంది. ఒక చిన్న హీరో సినిమా మహేష్ బాబు సినిమాని అది కూడా ఏకంగా యూఎస్ లో ఇలా క్రాస్ చేస్తూ ఉండడంతో.. ప్రేక్షకులు అందరూ సినిమాకి స్టార్ డమ్ కన్నా కథ ముఖ్యమని మరోసారి రుజువైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?  

Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!   

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News