Rashmika Mandanna Top 10 Movies: కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయిన రష్మిక మందన్న ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె కెరియర్లో టాప్ టెన్ కలెక్షన్లు సాధించిన సినిమాలో ఏమిటో చూద్దాం. ఆమె కెరీర్ లో పుష్ప మొదటి భాగం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా భారత దేశంలో 267 కోట్లు వసూలు చేస్తే వరల్డ్ వైడ్ గా 350 కోట్లు వసూలు చేసింది. ఇక ఆ తర్వాత ఆమె హీరోయిన్గా నటించిన విజయ్ వారసుడు సినిమా ఇండియాలో 177 కోట్లు వసూలు చేస్తే వరల్డ్ వైడ్ గా 297 కోట్లు వసూలు చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు 169 కోట్లు ఇండియాలో వరల్డ్ వైడ్ గా 221 కోట్లు వసూలు చేసింది. ఇక ఆమె కీలకపాత్రలో నటించిన సీతారామం సినిమా ఇండియాలో 65 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్గా 94 కోట్లు వసూలు చేసింది.


ఇక రష్మిక ధ్రువ సర్జ హీరోగా నటించిన పొగరు సినిమాలో హీరోయిన్గా నటించగా ఆ సినిమా ఇండియాలో 38 కోట్లు వరల్డ్ వైడ్ గా 45 కోట్లు వసూలు చేసింది. నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమా 35 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 52 కోట్లు వసూలు చేసింది. ఇక కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా 29 కోట్లు ఇండియాలో 36 కోట్లు వరల్డ్ వైడ్గా వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్గా డియర్ కామ్రేడ్ సినిమా 26 కోట్లు ఇండియాలో 37 కోట్లు వరల్డ్ వైడ్గా సాధించింది.


Also Read: Where Is Pushpa: పుష్ప మిస్సింగ్.. ఇంట్రెస్టింగ్ గా పుష్ప ది రూల్ అప్డేట్!


శర్వానంద్ హీరోగా రష్మిక వందన హీరోయిన్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఇండియాలో 9 కోట్ల 57 లక్షల వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 6 కోట్ల 20 లక్షలు వసూలు చేసింది. ఇక అమితాబచ్చన్ ప్రధానపాత్రలో నటించిన గుడ్ బై సినిమాలో రష్మిక మందన్న కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ఇండియాలో 6 కోట్ల వసూలు చేస్తే వరల్డ్ వైడ్గా 10 కోట్ల 55 లక్షలు వసూలు చేసింది.


Also Read: Kiccha Sudeep Letters: ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేస్తా..పొలిటికల్ ఎంట్రీ రోజే సుదీప్ కి బెదిరింపులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook