Threatening Letters to Star Hero: 'ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేస్తా'.. పొలిటికల్ ఎంట్రీ రోజే కిచ్చ సుదీప్ కి బెదిరింపులు

Threatening Letters to Kannada Star Hero: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది, ఆయన ప్రైవేటు వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరింపు లేఖల్లో పేర్కొన్నారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 19, 2023, 10:17 AM IST
Threatening Letters to Star Hero: 'ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేస్తా'.. పొలిటికల్ ఎంట్రీ రోజే కిచ్చ సుదీప్ కి బెదిరింపులు

Warning Letters to Kannada Star Kiccha Sudeep: కన్నడ రాష్ట్రానికి చెందిన స్టార్ హీరో కిచ్చా సుదీప్ కి బెదిరింపు లేఖలు కలకలం రేపుతున్నాయి. కిచ్చా సుదీప్ ని బెదిరిస్తూ రెండు లేఖలు తెరమీదకు వచ్చాయి. తాజాగా సుదీప్ బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఈరోజు అధికారికంగా బిజెపిలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆయనకు రెండు బెదిరింపు లేఖలు రావడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఆయనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామంటూ ఒక లేఖలో వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

అదేవిధంగా సుదీప్ కు రాసిన లేఖలలో అసభ్య పదజాలం కూడా గట్టిగానే వాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ లెటర్స్ సుదీప్ ఇంట్లో పని చేస్తున్న ఒక మేనేజర్కు అందాయని తెలుస్తోంది. సుదీప్ పలుకుబడికి, ప్రతిష్టకు భంగం కలిగించడానికి కొంత మంది చేసిన కుట్ర అని చెబుతూ సుదీప్ కుటుంబ సభ్యుడు మేనేజర్ గా వ్యవహరిస్తున్న మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పుట్టినహళ్ళి పోలీసులు ఫిర్యాదు అందుకున్న వెంటనే సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్, సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ అంటే నేరపూరితంగా  బెదిరించడం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం కింద కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలోనే నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు సమగ్ర విచారణ కోసం కేసును సిబిఐకి బదిలీ చేయాలని సీనియర్ పోలీసులు అధికారులు ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కన్నడ సినిమాల్లో కిచ్చా సుదీప్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఇటీవల ఉపేంద్ర నటించిన కబ్జా సినిమాలో కూడా కనిపించారు.

Also Read: Vitamin B12 Deficiency: విటమిన్ B12 లోపం ఉందా? వెంటనే 5 ఆహార పదార్థాలు తినడం మొదలుపెట్టండి!

కర్ణాటకలో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బిజెపి శాండిల్ వుడ్ స్టార్ హీరోల పైన కన్నేసి టాప్ హీరోలైన కిచ్చా సుదీప్, దర్శన్ ను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం సుదీప్ బిజెపిలో చేరాల్సి ఉంది. ముఖ్యమంత్రి బసవరాజు సమక్షంలో సుదీప్ కాషాయ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన బిజెపిలో చేరిన తర్వాత స్టార్ క్యాంపైనర్ గా కర్ణాటక మొత్తం ప్రచారానికి వెళ్లాల్సి ఉంది

Also Read: Vastu Tips for Money: రోడ్డు మీద దొరికిన డబ్బు తీసి జేబులో వేసుకుంటున్నారా... ఇది చదివి ఆ తరువాత ఆలోచించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News