Hari Hara Veera Malli First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టి పలు అంశాలపై జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యలు తలెత్తకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న పవన్ కళ్యాణ్ మరొకవైపు తన అభిమానులను నిరాశపరచకుండా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో భాగంగానే ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు చేయాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్లకు ఆయన హాజరు కాలేదు.  ఇక ప్రస్తుతం రాజకీయ బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు సినిమా షూటింగ్లో పాల్గొన్న బోతున్నారు.


అందులో భాగంగానే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్. ప్రస్తుతం ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.  ముఖ్యంగా అభిమానులకు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ బడ్జెట్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 


పవన్ కళ్యాణ్ హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్ర బృందం చిత్రీకరించింది.  పవన్ కళ్యాణ్ తో పాటు సుమారు 500 మంది ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సన్నివేశం చిత్రానికే హైలైట్ గా నిలవనుంది అని యాక్షన్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పుడు దసరా సందర్భంగా నిర్మాతలు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.  త్వరలోనే ఈ సినిమా నుండి మొదటి పాట విడుదల కానుంది అని చెప్పడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న తెలుగు సినీ ప్రియులు కూడా ఆనందపడ్డారని చెప్పవచ్చు.


 ఇక్కడ విశేషమేమిటంటే ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడారట అంతేకాదు ఇతర భాషలలో ఈ గీతాన్ని ఇతర గాయకులు పాడినట్లు సమాచారం. 
ఇందులో బాలీవుడ్ నటుడు బాబి డియోల్, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్, తనికెళ్ల భరణి , కోట శ్రీనివాసరావు, సుబ్బరాయ శర్మ, నాజర్ , అయ్యప్ప శర్మ, సునీల్, రఘుబాబు ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 10వ తేదీన సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది మార్చ్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. మరో వారం రోజుల్లో పాట విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇదీ చదవండి: పది పాసైతే చాలు రూ. 12,000 స్కాలర్‌షిప్ పొందవచ్చు.. ఇలా అప్లై చేసుకోండి..!


ఇదీ చదవండి:  Salary Hike: ప్రభుత్వం భారీ‌ గుడ్‌న్యూస్‌.. టీచర్ల జీతం మూడురెట్ల పెంపు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.