Salary Hike: ప్రభుత్వం భారీ‌ గుడ్‌న్యూస్‌.. టీచర్ల జీతం మూడురెట్ల పెంపు..!

Salary Hike To Madrasa Teachers: టీచర్లకు బంపర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. ఈ సందర్భంగా వారి జీతాలు ఏకంగా మూడు రెట్లు పెరగనుంది. గురువారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు గుడ్‌ న్యూస్‌ అందినట్లయింది.
 

1 /8

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కేబినెట్‌ మీటింగ్‌లో ఈ మేరకు గురువారం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మదర్సా టీచర్ల జీతాలను పెంచుతూ మహారాష్ట్ర ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మదర్సా టీచర్ల జీతాలు ఏకంగా మూడింతలు పెరగనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో షిండే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  

2 /8

ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమల్లోకి వచ్చే ముందే మహా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది.   

3 /8

ఇటీవలి కేబినెట్‌ సమావేశంలో ఓబీసీ, ట్రైబల్‌, ఇతర మైనారిటీలకు చెందినవారికి లాభదాయకమైన నిర్ణయాలు కేబినెట్‌ మీటింగ్‌లో తీసుకున్నారు. ఇందులో భాగంగా 80 ప్రతిపాదనలు రాగా అందులో 38 అమలు చేస్తోంది.  

4 /8

జకీర్‌ హుస్సేన్‌ మదర్సా మోడ్రనైజేషన్‌ స్కీమ్‌ ప్రత్యేకం. దీని చొరవతో మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌తోపాటు హిందీ, మరాఠి, ఇంగ్లిష్‌, ఉర్దు విద్యను సంప్రదాయ విద్యతోపాటు మదర్సాలలో అందిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వ మదర్సాల్లో పనిచేసే టీచర్ల జీతాల పెంపునకు కీలక నిర్ణయం తీసుకున్నారు.  

5 /8

అంతేకాదు మౌలానా ఆజాద్‌ మైనార్టీ ఫైనాన్షియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ను రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచుతూ అప్రూవ్‌ చేసింది మహా ప్రభుత్వం.  

6 /8

డీఎడ్‌ (డిప్లొమా ఎడ్యుకేషన్‌) క్వాలిఫై అయిన టీచర్లు నెలకు రూ.6000 జీతం అందుకునేవారు. కానీ, ప్రస్తుత జీతం పెంపుతో వారి జీతం రూ.16,000 పెరగనుంది. సెకండరీ టీచర్లు బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌ క్వాలిఫై అందింన టీచర్లు కూడా పొందనున్నారు. సెకండరీ స్థాయిల్లో అన్ని సబ్జెక్లులు చెప్పే టీచర్ల జీతం రూ.8000 నుంచి జీతాల పెంపుతో రూ.18,000 పెంచారు.  

7 /8

అంతేకాదు షిండే ప్రభుత్వం ఓబీసీ, ట్రైబల్‌ కమ్యూనిటీపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ క్రీమీ లేయర్‌ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచడంపై కూడా పనిచేస్తోంది. అంతేకాదు శబరీ ట్రైబల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ గ్యారంటీని కూడా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల సహాయం పెంచింది.  

8 /8

ఎన్నికల సంఘం మహారాష్ట్ర ఎన్నికలను నవంబర్‌ 26లోగా నిర్వహించాలని ప్రకటించింది. నవంబర్‌లోనే మహారాష్ట్ర ప్రభుత్వం గడువు కూడా ముగుస్తుంది. 288 అసెంబ్లీ సీట్లకు గాను 9.59 కోట్ల ఓటర్లు కలిగి ఉంది. ఇందులో 100పై బడ్డవారు 49,039