Harish Shankar Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా చేస్తూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. నిజానికి 2019లోనే ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ ఆయన ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. 2024 ఎన్నికల్లో ఆయన పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేయబోతుందా లేదా అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఆయన తన సినిమాలతో తన పొలిటికల్ మైలేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే వాదన టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్న సినిమా అయితే సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే సినిమా అయితే అభిమానులతో సహా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం హరీష్ శంకర్ డైరెక్షన్లో తనకేక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మాత్రమే. ఎందుకంటే ముందుగా అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా స్క్రిప్ట్ పక్కనపెట్టి మరి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని తెర మీదకు తెచ్చారు.


 పోనీ ఏమైనా కొత్త కథ అంటే గతంలో తమిళంలో తెరకెక్కిన తేరి పేరుతో రిలీజ్ అయి తెలుగులో కూడా పోలీసోడు పేరుతో రిలీజ్ అయిన విజయ్ సినిమా. దాన్ని పవన్‌కి తగినట్లుగా మార్పులు చేర్పులు చేశామని చెబుతున్న ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే విషయం క్లారిటీ లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు హరిష్‌ శంకర్‌కు పవన్ కళ్యాణ్ నుంచి ఈ సినిమా గురించి కొన్ని సూచనలు వెళ్లాయని తెలుస్తోంది.


Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!


అదేమిటంటే తాను 2024 ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో సినిమా కూడా ఎన్నికలకు కలిసి వచ్చే విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా సినిమాలో డైలాగులు ఉండాలని కోరినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అడిగితే హరీష్ శంకర్ మార్పులు చేర్పులు చేయకుండా ఉంటాడా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా వెంటనే మార్పులు చేర్పులు చేశారని పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగానే సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నేర్పిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలైతే తెలియాల్సి ఉంది.


Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK