Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

Keerthy Suresh Marriage News: మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వార్తల మీద ఆమె తండ్రి స్పందించారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 28, 2023, 07:45 PM IST
Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

Keerthy Suresh Father Clarity on Her Marriage: మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. సావిత్రి బయోపిక్ మహా నటిలో సావిత్రి పాత్రలో నటించి మహానటిగా ముద్ర వేసేసుకుంది. నిజానికి ఆమెకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ సినిమాలు పడటం లేదు.

ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని రకరకాల ప్రచారాలు అయితే తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మందితో ఆమెకు వివాహం జరగబోతోంది అంటూ ప్రచారాలు మొదలు కావడం వాటిని కీర్తి సురేష్ తోసి పుచ్చుతూ రావడం జరుగుతోంది. ఇక తాజాగా కీర్తి సురేష్ వివాహానికి సంబంధించి ఆమె తండ్రి సురేష్ కుమార్ స్పందించారు. దయచేసి నా కూతురు పెళ్లి గురించి అబద్ధాలు ప్రచారం చేయకండి అంటూ ఆయన మీడియాని కోరారు.

Also Read: Raashii Khanna Photos: ఐఫా అవార్డుల ఈవెంట్లో హాట్ బాంబ్ లా మారిన రాశిఖన్నా.. అందాల రాశులు చూడతరమా?

మా అమ్మాయి పెద్ద హీరోయిన్ సెలబ్రిటీల గురించి ఇలా ప్రచారాలు జరుగుతాయని నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను డైరెక్టర్ నే కదా. కానీ ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తే అందరికీ ఇబ్బంది అంటూ ఆయన కామెంట్ చేశారు. కీర్తి సురేష్ కి గనుక ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని దాచిపెట్టే ప్రసక్తి లేదని అది అందరితోనూ పంచుకుంటామని అన్నారు. అది ఆనందంగా పంచుకునే విషయమే కదా మేమెందుకు సీక్రెట్ గా పెళ్లి చేసేస్తాం అంటూ ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఇకమీదట ఇలాంటి విషయాల మీద నిరాధార వార్తలు రాయొద్దని ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించి క్లారిటీ తీసుకుని రాయమని ఆయన కోరారు. ఇవి చాలా సున్నితమైన విషయాలని పేర్కొన్న సురేష్ మీడియా దీన్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు. ఇక కీర్తి సురేష్ వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు కాగా ఆమె భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇక ఆమె ఈ సినిమా తప్ప తెలుగులో మరో సినిమా ఇప్పటివరకు సైన్ చేయకపోవడం గమనార్హం. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కుతాయేమో చూడాలి. చివరిగా ఆమె దసరా సినిమాలో వెన్నెల పాత్రతో అందరిని అలరించింది.

Also Read: Krithi Shetty Photos: సమంత స్టైలిస్ట్ డిజైన్ చేసిన చీరకట్టులో కృతి శెట్టి.. ఏమన్నా అందమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Trending News