Ustad Bhagath Singh Poster పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం వరుసగా సినిమా షూటింగ్‌లంటూ బిజీగా ఉంటున్నాడు. సుజీత్‌తో ఓజీ, హరీష్‌ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ సందడి చేస్తున్నాడు. మధ్యలో క్రిష్‌ హరి హర వీరమల్లు షూటింగ్‌ను మరిచిపోయినట్టున్నాడు. వినోదయ సిత్తం సినిమా రీమేక్ షూటింగ్‌ను పవన్ కళ్యాణ్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మాత్రం హరీష్‌ శంకర్ తీస్తోన్న సినిమా హాట్ టాపిక్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉస్తాద్ నుంచి రేపు ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్‌ బొట్టు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దీనిపై ఓ రిపోర్టర్‌ ప్రశ్నలను లేవనెత్తాడు. బొట్టు వెనుక విషయం ఏంటి? అని ప్రశ్నించాడు. దానికి హరీష్‌ శంకర్ ఇలా సమాధానం ఇచ్చాడు. మీరు కూడా బొట్టు గురించి అడిగితే ఎలా.. అది మన సంప్రదాయం ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, రోజు పెట్టుకోవచ్చు.. మిగతా విషయం వెండితెర మీద చూడండి అని రిప్లై ఇచ్చాడు.


సదరు రిపోర్టర్ తిరిగి మళ్లీ సమాధానం ఇచ్చాడు. 'పెట్టుకోవడం'..'పెట్టుకోకపోవడం'... గురించి కాదు శంకర్ జీ...ఇక్కడ విషయం మీద క్యూరియాసిటీతో అడిగా... అని ట్వీటేశాడు. పోస్టర్స్ వేసేది క్యూరియాసిటీ పెంచడం కోసం... థాంక్యూ ఫర్ యువర్ క్యూరియాసిటీ అని హరీష్ శంకర్ స్పందించాడు. క్యూరియాసిటీ పెంచడం వరకు ఓకె అండీ..కానీ భీమ్లా..భీమ్లా అంటున్నారు ఫ్యాన్స్...మరి దానికి కూడా ఓ సమాధానం ఇస్తే...వాళ్లు సంతృప్తి చెందుతారు అని మళ్లీ సదరు రిపోర్టర్ ట్వీట్ వేశాడు.


Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్


ఇక ఈ ట్వీట్‌కు మెగా అభిమాని, నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించాడు. అసలే కళ్యాణ్‌ బాబు ఓజీ.. ఆయన్ని చూపించడంలో హరీష్‌ అన్న చేశాడు పీజీ.. నో ఇష్యూస్ అండి.. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉందంటూ ట్వీట్ వేశాడు. ప్రస్తుతం ఈ బొట్టు మీద చర్చలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook