Harish Shankar Serious on Pawan kalyan Fans: గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించాల్సిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఏమనుకున్నారో ఏమో ఆ సినిమా పక్కన పెట్టేసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ని తెరమీదకి తీసుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గబ్బర్ సింగ్ సినిమాతో ఈ ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే తెలుగులో అందుబాటులో ఉన్న తమిళ తేరీ అనే సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. దాదాపుగా ఈ సినిమాకి పని చేస్తున్న ఒకరిద్దరు టెక్నీషియన్లు కూడా ఈ విషయాన్ని ఖరారు చేశారు. అయితే హరీష్ శంకర్ మార్క్ మార్పులు ఇది జరుగుతాయని చెబుతున్నారు.


అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద హరీష్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులను సోదరులారా భావించి ప్రతి ఎగ్జైమెంట్ ను షేర్ చేస్తున్నాను, కానీ మొన్న అతి చేశారు టూమచ్ గా లైన్ దాటేశారు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఎలాంటి అప్డేట్ చెప్పదలచుకోలేదంటూ ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ఇక హరీష్ శంకర్ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టుకున్నారు. ఎలా అయినా ఈ సినిమాతో హిట్ కొట్టి అటు పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ అందించడమే కాదు తాను కూడా మళ్లీ మరిన్ని సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. 
Also Read: Taraka Ratna Health Update Latest: ఎక్మో లేదు కానీ తారకరత్న ఆరోగ్యం..అభిమాని పాదయాత్ర!


Also Read: Raviteja Fans on Chiranjeevi: రవితేజ చిన్న హీరోనా? చిరుపై ఫాన్స్ ఫైర్!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook