Harish Shankar Tweet: ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో.. హరీష్ శంకర్ ఒకరు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్.. ఏప్పటికప్పుడు తన సినిమాలకి సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉంటారు. సినిమా అప్డేట్లతో పాటు అప్పుడప్పుడు అభిమానులకి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం హరీష్ శంకర్ ..త్వరలో విడుదల కాబోతున్న తన మిస్టర్ బచ్చన్ సినిమా అప్డేట్లు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. ఎవరికి భయపడను అంటూ హరీష్ శంకర్.. పెట్టిన ట్వీట్ ఎవరి గురించి అని అందరూ చర్చించుకుంటున్నారు.


"రిలీజ్ దగ్గర పడుతుంది కదా … ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు అని… ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది …. దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!" అంటూ హరీష్ శంకర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. 


 



అయితే కొందరు హరీష్ శంకర్ ఈ ట్వీట్ పెట్టింది.. దేవి ప్రియ.. అనే ఒక ట్విట్టర్ యూజర్ గురించి అని కామెంట్స్ పెడుతున్నాడు. కానీ అందులో నిజం ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హరీష్ శంకర్ ఇంత ఘాటుగా రెస్పాండ్ ఎందుకు అయ్యారు.. అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.


ఏదేమైనా ట్రోల్స్ కి పంచ్ లు ఇచ్చే డైరెక్టర్లలో.. హరీష్ శంకర్ కూడా ఒకరు. ట్విట్టర్లో మాత్రమే కాకుండా తన సినిమాలతో కూడా జవాబు చెప్పే.. హరీష్ శంకర్.. దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుద కి సిద్ధం అవుతోంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే.. హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇది. 


సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజ ఈ సినిమాతో అయినా హిట్.. అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత హరీష్ పవన్ కళ్యాణ్ తో ఉస్టాడ్ భగత్ సింగ్..సినిమా కూడా చేయనున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో.. వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి