Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనుసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనుసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 5, 2024, 01:13 PM IST
  • కుమారి ఆంటీ స్టాల్ లో సోనుసూద్..
  • సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో..
Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ..  వీడియో వైరల్..

Bollywood Actor sonu sood visits kumari aunty food stall in Hyderabad: బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సమయంలో ఆయన ఎంతో మందికి, తన వంతుగా సహాయం చేశారు. సొంత ఊర్లకు వెళ్లలేని వారికి బస్సులు, రైళ్లలో కూడా టికెట్ లు ఇప్పించి మరీ వారి గ్రామాలకు చేర్చారు. ఆకలితో ఉన్న వారికి నిత్యవసరాలు, మెడిసిన్ లు, కరోనా కిట్ లు, ఆక్సిజన్ కిట్ లు ఇలా ఎంతో మందికి కూడా సోనుసూద్ అండగా నిలిచారు. అంతేకాకుండా.. ఎవరికి ఏ కష్టం వచ్చిన కూడా తనను సంప్రదించాలని కూడా ఫోన్ నెంబర్ ను కూడా ఇచ్చారు. అనేక మంది క్యాన్సర్ పెషెంట్లు, గుండె జబ్బులు బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులుతో వైద్యం చేసుకునేందుకు డబ్బులు లేని వారు సోనుసూద్ వల్ల ఎంతో సహాయాన్ని పొందారు.

 

ఆయనకు ఫోన్ చేసి.. తమ సమస్యలు చెప్పుకొగానే.. వెంటనే ఆయన తన సిబ్బందిని అక్కడికి వెళ్లి సహయం చేసేలా అలర్ట్ చేసేవారు. ఇదిలా ఉండగా.. అలాంటి బాలీవుడ్ హీరో సోనుసూద్ ఈరోజు హైదరాబాద్ ఫుడ్ స్టాల్ ఫెమ్.. కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. అక్కడున్న వారితో సరదాగా సెల్ఫీలు కూడా దిగారు. సోనుసూద్ ను చూడగానే కుమారీ ఆంటీ ఒకింత ఎమోషనల్ కు గురయ్యారు. ఈ క్రమంలో కుమారీ ఆంటీ గురించి సోనుసూద్ మాట్లాడుతూ.. కుమారీ ఆంటీ మహిళలకు ఆదర్శమని అన్నారు. తను స్వయం ఉపాధితో అందరి మన్ననలు పొందడమే కాకుండా.. ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.

మహిళా సాధికారతకు బెస్ట్ ఎగ్జాంపుల్ కుమారీ ఆంటీ అని ప్రశంసించారు. అంతేకాకుండా..  ఈరోజు స్టాల్ లో ఏ ఫుడ్ ఉందని అడిగారు. వెజ్ 80, నాన్ వెజ్ 120 అని కుమారీ ఆంటీ చెప్పారు. దీంతో తాను.. వెజిటెరియన్ అని.. సో.. ఈరోజు వెజ్ టెస్ట్ చేస్తానని అన్నారు. తనకు ఏదైన కన్సెషన్ ఉందా.. అని అడగ్గా.. మీకు ఫ్రీ ఫుడ్ అంటూ కుమారీ ఆంటీ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఫన్నీగా నవ్వుకున్నారు.

Read more:Snake bite: నాగు పాముకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

కుమారీ ఆంటీ మాట్లాడుతు.. కరోనా సమయంలో, ఆతర్వాత కూడా ఎంతో మందికి అండగా ఉన్నారు.. మీకు ఏమిచ్చిన తక్కువే.. నా వంతుగా ఫ్రీగా ఫుడ్ పెడుతానంటూ కుమారీ ఆంటీ ఎమోషనల్ అయ్యారు. ఈ నేపథ్యంలో కుమారీ ఆంటీ స్టాల్ లో ఫుడ్ టెస్ట్ చేశారు సోనూసూద్. అక్కడున్న వారంతా సోనుసూద్ తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x