HBD Ram Charan: ఆ స్పెషాలిటే రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్‌ను చేసింది..
HBD Ram Charan: రామ్ చరణ్.. చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు చిరు తనయుడు నుంచి మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ సందర్బంగా రామ్ చరణ్ సినీ ప్రస్థానంపై జీ న్యూస్ స్పెషల్ ఫోకస్..
HBD Ram Charan: రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరుతగా తెరంగేట్రం చేసి తండ్రి తగ్గట్టే మగధీరగా నిలిచాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. రాజమౌళి దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరోగా రామ్ చరణ్‌ను స్టార్‌ను చేసింది. ఆ తర్వాత ఆరెంజ్ అంటూ లవబుల్ సినిమా చేసాడు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ తర్వాత రచ్చ, నాయక్ వంటి సినిమాలతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా సక్సెస్‌లు అందుకున్నా.. నటుడిగా రామ్ చరణ్‌కు పెద్ద పేరు మాత్రం రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా డాన్స్, ఫైట్స్‌లలో ఈజ్ చూపించాడు కానీ.. ముఖంలో ఎక్స్‌ప్రెషెన్ పలకించలేడని కెరీర్ తొలినాళ్లలో క్రిటిక్స్ నుంచి విమర్శలు అందుకున్నాడు రామ్ చరణ్.
అంతకు ముందు కొన్ని చిత్రాల్లో రామ్ చరణ్ యాక్ట్ చేసినా.. అందులో పెద్దగా యాక్టింగ్‌కు స్కోప్ ఉండేది కాదు. నాలుగు డాన్సు స్టెప్పులు.. మూడు ఫైట్స్ అంటూ ఓ ఫార్ములా ప్రకారం సినిమాలు చేసేవాడు. ఇలాంటి టైమ్‌లో వాటన్నిటికీ చెక్ చెబుతూ సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' మూవీతో రామ్ చరణ్ కెరీర్‌ను పూర్తిగా ఛేంజ్ చేసింది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్.. పూర్తిగా మారిపోయింది. రామ్ చరణ్‌లోని యాక్టింగ్ స్కిల్స్ ఏంటో అందరికీ తెలిసొచ్చేలా ఈ సినిమాలో అద్భుత నటనను అతన్ని నుంచి సుకుమార్ రాబట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలోని నటనతో తిట్టి విమర్శకుల నోళ్లతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'వినయ విధేయ రామ' సినిమాతో నటుడిగా పలు విమర్శలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తన తోటి స్టార్ అయిన ఎన్టీఆర్‌తో చేసిన 'ఆర్ఆర్ఆర్' (RRR) రౌద్రం రణం రుధిరం సినిమాతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూర్తి స్థాయిలో నటించిన 'ఆచార్య' మూవీతో భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నారు. అంతకు ముందు రామ్ చరణ్ నటించిన ‘మగధీర’,‘బ్రూస్లీ’ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తే.. రామ్ చరణ్ తండ్రి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ లో ఓ పాటలో అతిథిలా మెరిసాడు.
ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీలో చేస్తున్నాడు. దాంతో పాటు బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అటు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. రామ్ చరణ్ ప్రముఖ సామాజిక మాధ్యమం Xలో దాదాపు 3.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అటు మరో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 21.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter