Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే

Vijay Antony Love Guru Movie Trailer Out: ప్రత్యేక కథలతో సినీ ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న హీరో విజయ్‌ ఆంటోనీ 'లవ్‌గురు'గా ముందుకు వస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ నవ్వులు తెప్పిస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 25, 2024, 09:37 PM IST
Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే

Love Guru Trailer: హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు వంటి అనేక పాత్రల్లో మెరుస్తున్న విజయ్‌ ఆంటోనీ హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రంజాన్‌ సందర్భంగా తన కొత్త సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా ఆ సినిమా ట్రైలర్‌ను విడుదలచేశారు. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'లవ్‌గురు'. విజయ్‌ ఆంటోనీ హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 11వ తేదీన విడుదల కానుంది. హోలీ పండుగ సందర్భంగా 'లవ్‌గురు' ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే ప్రేక్షకులు నవ్వాకుండా ఉండలేరు. ట్రైలర్‌ విడుదల చేస్తూ చిత్రబృందం 'ఈ  లవ్‌గురు చిత్రం ప్రత్యేకంగా భార్యామణుల కోసం తీయబడినది' అని ప్రకటించడంతోనే సినిమా కథ ప్రత్యేకత ఏమిటో అర్థమవుతోంది.
 
Also Read: Movie Stars Holi: హోలీ సంబరాల్లో సినీ తారలు.. ఒక్కొక్కరు ఒక్కోలా

హాస్యభరితమైన ప్రేమకథగా 'లవ్‌గురు' రూపుదిద్దుకుంది. తండ్రి నుంచి తప్పించుకునేందుకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్న యువతితో విజయ్‌ ఆంటోనీ ఎదుర్కొనే పరిస్థితులు సినిమా కథగా ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయితో భర్త ఎదుర్కొనే స్థితినే 'లవ్‌గురు' సినిమా. వన్‌సైడ్‌ లవ్‌ చేసిన భర్త పాత్రలో విజయ్‌ ఆంటోనీ మెరవగా.. లీల పాత్రలో మృణాళిని రవి నటించారు. 'నా భార్యను నేను వన్‌సైడ్‌ లవ్‌ చేస్తున్న మావయ్య' అని డైలాగ్‌ ప్రారంభంతో ట్రైలర్‌ మొదలవుతుంది.

Also Read: Naveen Vijay Krishna: తండ్రి నాలుగు పెళ్లిళ్లను వెనకేసుకొచ్చిన హీరో కొడుకు.. కానీ తనకు మాత్రం పెళ్లి వద్దంట

ప్రేమతోనే ఏదైనా సాధ్యమని చెప్పడమే 'లవ్‌గురు' సినిమా. ఇష్టంలేని భార్యను తనను ప్రేమించుకునేలా చేయడమే మిగతా కథ అని సినిమా ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాకు భరత్‌ ధనశేఖర్‌ సంగీతం అందించారు. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. హాస్యంతో కూడిన చిత్రం కావడంతో జనాలు ఆదరిస్తారనే భావనలో చిత్రబృందం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తోంది. గతంలో 'బిచ్చగాడు' పేరుతో సందేశాత్మక సినిమాలు తీసిన విజయ్‌ ఆంటోనీ వినోదాత్మక చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమాకు అతడే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News