Kanguva glimpse: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ మూవీ 'కంగువా'(Kanguva). శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌తో కలిసి యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీటీమ్. తాజాగా రిలీజైన ఈ ప్రచార చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. టీజర్ లో సూర్య ఎంట్రీ చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సూర్య యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీరలెవల్లో ఉంది. ఈ చిత్రాన్ని త్రీడీలో పది భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు డైరెక్టర్ గా పనిచేసిన శివ ఈ సినిమాను తెరకెక్కుస్తున్నారు. సూర్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారని టాక్. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేయగా.. తాజాగా రిలీజైన టీజర్ దానిని నిజం చేసేలా కనిపిస్తోంది. ప్రచార చిత్రామే ఈ లెవల్లో ఉంటే.. ఇక ట్రైలర్ ఏ లెవెల్లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమిళంలో పేరున్న రచయిత మదన్ కర్కి (MadhanKarky) మాటలు రాస్తున్నారు. బాలీవుడ్ నటి దిషా పటాని (DishaPathani) సూర్య జోడీగా నటిస్తోంది. సూర్య ఇంతవరకు చేయని పాత్రను చేస్తున్నాడు. ఇందులో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తే ఈ సినిమా కోలీవుడ్ రికార్డులను తిరగరాసేలా ఉంది.  



Also Read: BRO Trailer: పవన్ డైలాగ్స్.. తేజ్ రియాక్షన్స్.. ఆకట్టుకుంటున్న 'బ్రో' ట్రైలర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook