F3 Movie Story: వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌తో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్ ఎఫ్ 3 సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఎఫ్ 3 సినిమా కధపై సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా సాగుతోంది.  ఇంతకీ ఆ కథేంటో తెలుసా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 సినిమా ( F3 Movie ) పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వరుసగా 5 విజయాలు అందుకుని డబుల్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనిలి రావిపూడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఎఫ్ 2లో నటించిన వెంకటేశ్ ( Venkatesh ), వరుణ్ తేజ్ ( Varun Tej ), రాజేంద్రప్రసాద్, తమన్నా( Tamannaah ), మెహ్రీన్‌లు కూడా ఇందులో కన్పించనున్నారు. ఇప్పటికే ఎఫ్ 3 విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఆగస్టు 27న ధియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్‌కు తగ్గట్టుగానే షూటింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఈసారి సినిమా బడ్జెట్ కూడా 80 కోట్లకు చేరిపోయిందట. దర్శకుడు అనిల్ ఒక్కడే 12 కోట్లు తీసుకుంటున్నాడు. మరోవైపు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు 8 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. 


ఈ నేపధ్యంలో ఎఫ్ 3 కధ ( F3 Story ) పై సోషల్ మీడియాలో  ప్రచారం సాగుతోంది. కధ ఇదేనంటూ ట్రోలింగ్ ( F3 Story ) జరుగుతోంది. డబ్బులతో వచ్చే సమస్యలపై ఎఫ్ 3 కధ అల్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హీరోల భార్యలైన తమన్నా, మెహ్రీన్‌లు చేసే మితిమీరిన ఖర్చులు, చేసిన అప్పులు, తీర్చలేక పడే పాట్ల చుట్టూ కథ తిరుగుతోంది. భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారనే కాన్సెప్ట్‌తో ఎఫ్ 3 తెరకెక్కనుంది. భార్యలు చేసిన మితిమీరిన ఖర్చులతో అప్పులు తట్టుకోలేక..వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు. ఇక అక్కడ్నించి వారికెదురయ్యే సమస్యల చుట్టూ సినిమా కథ ఉంటుంది. ఈ కథే ఇప్పుడు సోషల్ మీడియా ( Social Media )లో చక్కర్లు కొడుతోంది. 


Also read: Surya movies: సూర్యకు ఆ సినిమాలు చూడాలంటే భయమేనట, కారణం తెలిస్తే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook