Honeymoon Express Streaming On Aha: చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా.. బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్. జూన్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రేమ, పెళ్లి, విడాకులపై వచ్చిన ఈ మూవీ నేటి యువతకు పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో చక్కగా తెరకెక్కించారు. సినిమాలో ట్విస్టులు, సస్పెన్స్ థ్రిల్‌కు గురి చేశాయి. కేకేఆర్, బాల రాజ్ నిర్మాతలుగా వ్యవహరించగా.. కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. ఆగస్టు 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రికార్డుస్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BSNL New Plan: ఇది కదా కావాల్సింది..! ఎక్కువ రోజులు వ్యాలిడిటీ తక్కువ ధరలోనే ప్లాన్‌.. డైలీ 2జీబీ డేటా రోజుకు రూ.7 మాత్రమే..  


ఇక ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో కూడా గత కొద్దిరోజులుగా స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. చైతన్య, హెబ్బా పటల్ యాక్టింగ్‌కు ఆడియన్స్‌ మంచి మార్కులే పడ్డాయి. సెటైరికల్‌గా సాగిపోయే కథలో ట్విస్టులతో ప్రేక్షకులు బాగా ఎంటర్‌టైన్ అవుతున్నారు. అమెజాన్‌లో ఆకట్టుకున్న హానీమూన్ ఎక్స్‌ప్రెస్‌.. ఆహాలో కూడా అలరిస్తుందని మేకర్స్ అంటున్నారు. 


స్టోరీ ఏంటంటే..?


నేటి తరం యువత ప్రేమ పెళ్లి చేసుకోవడం.. చిన్న గొడవలను పెద్దది చేసుకోవడం.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం చూస్తునే ఉన్నాం. సరిగ్గా అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌నే తీసుకుని డైరెక్టర్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ను తెరకెక్కించారు. స్టోరీలో సోనాలి (హెబ్బా పటేల్), ఇషాన్ (చైతన్యరావు) ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కాపురంలో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. అయితే వీరిద్దరికి బాల (తనికెళ్ల భరణి), త్రిపుర సుందరి (సుహాసిని) జంట ఓ సలహా ఇస్తుంది. ఈషాన్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే రిసార్ట్‌లోకి వెళ్లిన తరువాత వీళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి..? వారిద్దరు విడాకుల నిర్ణయాన్ని మార్చుకున్నారా..? అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని తప్పకుండా ఓటీటీలో చూసేయండి. 


Also Read: Job Notification: నిరుద్యోగులకు దసరా గిఫ్ట్.. మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.