Job Notification: నిరుద్యోగులకు దసరా గిఫ్ట్.. మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల

371 Posts Notification Of Telangana Medical And Health Department: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం ఓ భారీ కానుక ఇచ్చేసింది. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 11, 2024, 09:31 PM IST
Job Notification: నిరుద్యోగులకు దసరా గిఫ్ట్.. మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల

Telangana Job Notification: సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ఉద్యోగాల భర్తీని ఆగమేఘాల మీద పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. మరొక ఉద్యోగ ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 371 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు. దసరాకు ముందు రోజే నిరుద్యోగులకు కానుక అందినట్టుగా కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Karnataka: భార్య చెప్పిన మాట బుద్దిగా విన్నాడు.. రూ. 25 కోట్లు గెల్చుకున్నాడు.. ఎలాగో తెలుసా..?

 

నోటిఫికేషన్‌ ఇదే!
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు ప్రకటన విడుదల చేసింది. గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్‌, నర్సింగ్‌ అధికారి పోస్టుల భర్తీ ప్రకటనకు అనుబంధంగా ఈ ప్రకటన విడుదల చేసినట్టు బోర్డు వెల్లడించింది. సెప్టెంబర్‌లో 2,050 నర్సింగ్‌ అధికారుల పోస్టులకు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటికి అదనంగా తాజాగా 272 నర్సింగ్‌ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

Also Read: Railway Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో రైల్వేలో ఉద్యోగాల భర్తీ, చివరి తేదీ ఎప్పుడంటే

 

గతంలో 2,050 పోస్టులకు తాజా పోస్టులు కలపడంతో మొత్తం 2,322 నర్సింగ్‌ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్‌ పోస్టులు అయ్యాయి. అక్టోబర్‌ 14వ తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం నవంబర్‌ 17వ తేదీ రాత పరీక్ష జరగనుంది. కంప్యూటర్‌ విధానంలో ఈ పరీక్ష ఉండనుంది.

గతంలో ప్రకటించిన 633 ఫార్మసిస్ట్‌ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ కొత్తగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త పోస్టులతో కలిపి మొత్తం ఫార్మసిస్ట్‌ పోస్టుల సంఖ్య 732కి చేరాయి. ఈ పోస్టులకు సంబంధించి ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నవంబర్ 30వ తేదీన పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News