Hema - Karate Kalyani: జబర్ధస్త్ వర్ష విషయమై హేమపై విరుచుకుపడ్డ కరాటే కళ్యాణి..
Karate Kalyani Fires on Hema: జబర్ధస్త్ వర్ష విషయమై నటి హేమపై విరుచుకుపడ్డ కరాటే కళ్యాణి. రీసెంట్గా హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పోలీసులకు అడ్డంగా దొరికినా.. నేను ఆ పార్టీలో లేనంటూ కహానిలు చెప్పింది. ఈ వ్యవహారంపై కరాటే కళ్యాణి.. నటి హేమపై జీ తెలుగు న్యూస్ లైవ్ డిబేల్ పలు సంచలన విషయాలు వెల్లడించింది.
Rave Party Latest Updates: ఓ వైపు ఎండలు.. మరోవైపు ఎలక్షన్స్‌తో హీట్ ఎక్కిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంగళూరులో ఇల్లీగల్‌గా జరిగిన రేవ్ పార్టీలో హేమ సహా పలువురు టాలీవుడ్ నటులు పట్టుడటం సంచలనం రేపింది. అయితే ముందుగా హేమ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నట్టు కలరిగింగ్ ఇచ్చింది. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు అక్కడ జరిగిన ఈవెంట్‌లో హేమ ఉన్నట్టు ఆధారాలు చూపడంతో ఏమి చేయాలో తెలియక గమ్మునుండిపోయింది. తాజాగా హేమ బిహేవియర్ పై ఎలాంటిదనే విషయమై తోటి నటి కరాటే కళ్యాణి జీ మీడియాకు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
హేమ ఓన్లీ లైఫ్ మెంబర్ మా అసోషియేషన్. నరేష్ 'మా' అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జబర్ధస్త్ అమ్మాయి వర్ష ఫోటోను మా మెంబర్స్‌కు సంబంధించిన ఓ వాట్సాప్ గ్రూపులో హేమ పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఎందుకు పెట్టారు అని అందరు డిస్కస్ చేస్తుండగా.. హేమ అప్పటికపుడే వర్ష ఫోటోను డిలీట్ చేసింది. ఎవరికో ఫోటో పంపబోయి గ్రూపులో వచ్చిందనే విషయాన్ని ఆ తర్వాత చెప్పింది. ఈ వాట్సాప్ గ్రూపు మా వార్ టైపు లాంటిది. అసలు గ్రూపుల్లో అమ్మాయిల ఫోటోలు ఎందుకొస్తున్నాయి. అసలు హేమ అపుడు వర్ష ఫోటోను ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించింది కరాటే కళ్యాణి. అపుడు 'మా' అసోషియేషన్‌కు సంబంధించిన గ్రూపులో ఉన్న మెంబర్స్ అడిగితే ఈ విషయాన్ని చెబుతారన్నారు.
హేమ తప్పుల మీద తప్పలు చేసి దొరికిపోతూనే ఉంది. తాజాగా హేమ బ్లడ్ శాంపుల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆమె ఈ కేసు నుంచి బయట పడాలనే కొరుకుంటున్నాను. కానీ బెంగళూరు రేవ్ పార్టీ సందర్భంగా హేమ తన ఇంట్లో బిర్యానీ చేస్తున్నట్టు ఏవేవో చేసి చివరికి అడ్డంగా బుక్ అయిందనే విషయాన్ని కరాటే కళ్యాణి ప్రస్తావించింది. ఏది ఏమైనా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పెద్ద తలకాయలను ఒదిలేసి చోటా మోటా యాక్టర్స్‌ను పోలీసులు బలి పశువులను చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ డ్రగ్ రాకెట్ వెనక ఎవరెరున్నారది తేలాల్సి ఉంది.
Read more: Hyderabad Pothole: హ్యాట్సాఫ్.. మహిళ చేసిన పని సర్కారునే దిగొచ్చేలా చేసింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter