Hyderabad Pothole: హ్యాట్సాఫ్.. మహిళ చేసిన పని సర్కారునే దిగొచ్చేలా చేసింది..

Hyderabad: ఒక మహిళ బురదలో కూర్చుని లేవనంటూ  భీష్మించుకుని కూర్చుంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటానంటూ, హమీ ఇస్తే తప్ప లేవనంటూ మోండికేసింది. ఈ ఘటన నాగోల్ లో చోటు చేసుకుంది. దీనిపై ఏకంగా ఉన్నతాధికారులు దిగి వచ్చి మహిళతో మాట్లాడారు. 

Written by - Inamdar Paresh | Last Updated : May 24, 2024, 06:34 PM IST
  • దిగోచ్చిన జీహెచ్ఎంసీ..
  • ఎన్నికల తర్వాత పనులు ప్రారంభిస్తామని హమీ..
Hyderabad Pothole: హ్యాట్సాఫ్.. మహిళ చేసిన పని సర్కారునే దిగొచ్చేలా చేసింది..

woman sits in pothole to protest for better roads in hyderabad: కొన్నిసార్లు మనం చేసే చిన్న పనులు కూడా ఎందరిలోనే కనువిప్పు కల్గిస్తాయి. వంద అడుగులు వేయాలన్న.. ఒక్కఅడుగుతోనే మొదలౌతుంది. అందుకే ఏంచేయగలను.. నాతో ఏమౌతుందని ఎప్పుడు మనల్ని మనం నిరుత్సాహా పర్చుకొవద్దు. సమాజంలో కొందరు ఎలా ఉంటే అలా వెళ్లిపోతుంటారు. పక్కన జరుగుతున్న వాటిని అస్సలు పట్టించుకోరు. ఎవరు ఎటు పోతే మాకేంటీ అన్న విధంగా ఉంటారు. కానీ మరికొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు.

Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..

చుట్టపక్కల జరుగున్న ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు అందరిని నిలదీస్తుంటారు. సమాజంలో ఉన్నతంగా ఉంటే, మంచి పనులు చేస్తు అందరికి ఆదర్శంగా ఉంటారు. ఇక మరోవైపు.. ఇటీవల హైదరాబాద్ లో ఒక మహిళ చేసిన పని వల్ల ఏకంగా ఉన్నతాధికారులను దిగివచ్చేలా చేసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తివివరాలు..

హైదరాబాద్  కు ఎక్కడి నుంచో ఉద్యోగాలు, బిజినెస్ ల కోసం వస్తుంటారు. ఇక్కడ అనేకమంది ప్రతీరోజు ఉదయం నుంచి తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. కొందరు బిజినెస్ రంగంలోన రాణిస్తుంటే మరికొందరు ఐటీలో మంచి జాబ్ చేస్తుంటారు. ఇలా రకరకాలుగా తమ పనుల్లో బిజీగా ఉంటారు. కానీ హైదరాబాద్ లో చినుకు పడితే చాలు.. జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోతుంది. కొన్ని ప్రదేశాల్లో రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి గుంతలుగా ఏర్పడుతాయి. వర్షంలో ముఖ్యంగా ఎక్కడ గుంతలున్నాయో.. ఎక్కడో మాన్ హోల్స్ ఉన్నాయో కూడా అస్సలు అర్థంకాదు.   ఈ నేపథ్యంలో నాగోల్ బండ్లగూడలో ఒక మహిళ బురదలో కూర్చుని తన నిరసన చేపట్టింది. తమకు న్యాయం చేయాలని ఈ మార్గంలో ప్రతిరోజు నరకం చూస్తున్నామంటూ మహిళ బురదలో కూర్చొని అందరిని ఆలోచింప చేసింది.

దిగొచ్చిన అధికారులు..

మహిళ బురదలో కూర్చుని నిరసన తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు దిగొచ్చారు. బండ్లగూడ , నాగోల్ మార్గంలో రెండు నెలల క్రితమే.. కోటి  ఇరవై ఆరు లక్షలు మంజురు చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా, పనులు చేయడంలేదని, కోడ్ తర్వాత పనులు పూర్తి చేస్తామంటూ అధికారులు హమీ ఇచ్చారు. దీనిపైన జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికలు పూర్తి కాగానే దీనిపై పనులు ప్రారంభిస్తామంటూ హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి మాత్రం.. బురద గుంటల్లో.. మట్టివేసి ప్యాచ్ వర్కింగ్ చేసే పనులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానికులు కూడా అధికారులపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచొ ఈ మార్గంలో గుంతల  వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని, ఇప్పటికైన చర్యలు తీసుకొవాలంటూ కోరారు.

Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

ప్రస్తుతం మహిళ చేసిన పని వల్ల.. ఏకంగా ఉన్నతాధికారుల వరకు ఈ విషయం వెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లు... సదరు మహిళల చేసిన పనికి శభాష్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక సదరు మహిళ తాము అన్నిరకాలు టాక్స్ లు పే చేస్తున్నామని, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని అంటూ కూడా తెల్చి చెప్పింది. మొత్తానికి అధికారులు దిగివచ్చి పనుల మీద హమీ ఇవ్వడంతో స్థానికులు తమ సమస్యకు పరిష్కారం దొరికిందని భావిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News