Bappi Lahiri Telugu Hit songs List: భారత సినీ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూయగా.. తాజాగా  ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి (69) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దాంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1952లో పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో బప్పి లహిరి జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంగీతకారులు కావడంతో.. బప్పి లహిరి చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగులో పలు సినిమాలకు సంగీతం అందించారు. అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ 'జఖ్మీ' చిత్రం ద్వారా పాపులర్ అయ్యారు. ఆపై డిస్కో డ్యాన్సర్‌, డ్యాన్స్‌ డ్యాన్స్‌, సాహెబ్‌, కమాండో, గురు దక్షిణ, ప్రేమ ప్రతిజ్ఞ, గురు, త్యాగి, ది దర్టీ పిక్చర్‌, రాక్‌ డ్యాన్సర్‌, బద్రినాథ్‌ కీ దుల్హనియా వంటి హిందీ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 


సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన 'సింహాసనం' సినిమాతో బప్పి లహిరి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. సింహాసనం సినిమా పాటలు హిట్‌ కావడంతో.. ఆయనకు తెలుగులోనూ వరుసగా అవకాశాలు వచ్చాయి. త్రిమూర్తులు, సామ్రాట్‌, స్టేట్ రౌడీ, గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు, నిప్పు రవ్వ, బిగ్‌బాస్‌ సినిమాలకు బప్పి లహిరి సంగీత దర్శకుడిగా పని చేశారు. అంతేకాదు చాలా సినిమాలో పాటలు కూడా పాడారు. 



మెగాస్టార్ చిరంజీవికి బప్పి లహిరి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. స్టేట్ రౌడీలో తదిగిన తోం, చుక్కల పల్లకిలో, వన్ టూ త్రీ పాటలు హిట్ అయ్యాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో భద్రాచలం కొండా సీతమ్మ వారి దండ, పని సాససా, వానా వాన వెల్లువాయె, పాపా రీటా పాటలు బంపర్ హిట్ అయ్యాయి.  రౌడీ అల్లుడు సినిమాలో అమలాపురం బుల్లోడా, చిలుకా క్షేమమా, లవ్ మీ మై హీరో సాంగ్స్.. బిగ్ బాస్ చిత్రంలో మావా మావా, నంబర్ 1, 2 పాటలు ఫేమస్ అయ్యాయి. చిరంజీవి, బప్పి లహిరి కాంబోలో వచ్చిన సాంగ్స్ ప్రతి ఒకటి హిట్ అయింది. 


Aslo Read: IPL 2022 Auction: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్వాగతం పలికిన షారుక్ ఖాన్.. సల్మాన్, సైఫ్, సంజయ్ కూడా (వీడియో)


Also Read: Gangubai Kathiawadi: నా తల్లిని 'వేశ్య'ను చేశారు.. 'గంగూబాయి' సినిమాపై తిరగబడుతున్న ఆమె ఫ్యామిలీ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook