నేచురల్ స్టార్ నాని ముందు బంపర్ ఆఫర్లు
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలోనే మరో 4 సినిమాలు ఎనౌన్స్ చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ఆ మూవీస్ వివరాలేంటో చూద్దాం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రానుంది. ఇదొక మల్టీస్టారర్ మూవీ. నాగ్, నాని హీరోలుగా నటించబోతున్నారు. జనవరి నుంచి సెట్స్ పైకి రానుంది.
‘ దర్శకుడు కిషోర్ తిరుమలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీకి చిత్రలహరి అనే డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఇదింకా పూర్తిగా స్క్రీన్ ప్లే రూపంలోకి రాలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉందని కిషోర్ తిరుమల ప్రకటించాడు.
‘ నాని లిస్ట్ లో ఉన్న మరో దర్శకుడు హను రాఘవపూడి. మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు హను.
‘ దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నాడు నాని. ఫిదా తర్వాత మరోసారి ట్రాక్ లోకొచ్చిన ఈ డైరక్టర్, నాని కోసం ఓ స్టోరీలైన్ అనుకున్నాడట. ఇది కూడా వచ్చే ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.