Nikhil:ఓ బిడ్డకు తండ్రి అయిన నిఖిల్.. సంబరాల్లో ఫ్యామిలీ మెంబర్స్..
Nikhil: హీరో నిఖిల్ ఎట్టకేలకు ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో హీరో నిఖిల్ ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మరియు అభిమానులు, శ్రేయోభిలాషులు హీరో నిఖిల్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
Nikhil: ఇప్పటికే పెళ్లితో ఓ ఇంటివాడైన నిఖిల్.. ఇపుడు ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. హీరో నిఖిల్, పల్లవిల దంపతులు ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు తన సన్నిహితులకు తెలియజేసారు. తన కుమారుడికి ఎత్తుకొని ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసారు. దీంతో హీరో నిఖిల్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు వెల్లవెత్తుతున్నాయి.
హీరో నిఖిల్ విషయానికొస్తే.. హ్యాపీ డేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా డిఫరెంట్ జానర్ మూవీస్‌తో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. ఇక కార్తికేయ 2 మూవీ సక్సెస్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. ఈసినిమా కృష్ణతత్త్వాన్ని చెప్పిన విధానం అందరినీ కట్టిపడేసింది. ఈ సినిమా తెలుగు ఆడియన్సే కాదు.. హిందీ ప్రేక్షకుల మెప్పును సైతం పొందింది.
ఇక నిఖిల్.. పల్లవిని 2020 మే 14న కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన మూడున్నర యేళ్ల తర్వాత వీరి కుటుంబంలోకి వారసుడు వచ్చాడు. మరోవైపు మ్యారేజ్ తర్వాత నిఖిల్ కెరీర్ మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతుంది. లాస్ట్ ఇయర్ 'స్పై' మూవీతో పలకరించాడు. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. త్వరలో నిఖిల్.. 'స్వయంభూ' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ మూవీపై సినీ ఇండస్ట్రీలో చాలా అంచనాలే ఉన్నాయి.
Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన
Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook