Nikhil Siddharth next Movie Announced: యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhart) వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ (Karthikeya 2)తోపాటు మరో సినిమా '18 పేజీస్'లోనూ నటిస్తున్నాడు. అయితే తాజాగా మరో సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ చేశాడు నిఖిల్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'స్పై' (Spy) అనే టైటిల్ ను ఖరారు చేయటంతోపాటు నిఖిల్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈడీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 




శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వహించిన '‘హ్యాపీడేస్' చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మయ్యాడు నిఖిల్. మొద‌టి సినిమాతోనే  ప్రేక్ష‌కుల‌కు అభిమానం సంపాదించాడు. తర్వాత వరుస పరాజయాలు చవిచూశాడు. స్వామి రారా చిత్రంతో అతడి కెరీర్ ఒక్కసారిగా ములుపు తిరిగింది.  కార్తికేయ‌, ‘ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడ‌’, ‘అర్జున్ సుర‌వ‌రం’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 


Also Read: KGF Chapter 2: తొలి మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు, 5 వందల కోట్ల దిశగా కేజీఎఫ్ ఛాప్టర్ 2


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook