KGF Chapter 2: తొలి మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు, 5 వందల కోట్ల దిశగా కేజీఎఫ్ ఛాప్టర్ 2

KGF Chapter 2: పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 భారీ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలి మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు వసూలు చేసి..ఇప్పుడు 5 వందల కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమౌతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2022, 01:52 PM IST
  • దుమ్ము రేపుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 కలెక్షన్లు
  • తొలి మూడ్రోజుల్లోనే 3 వందల కోట్ల కలెక్షన్లతో కొత్త రికార్డు
  • వారంలో 5 వందల కోట్ల క్లబ్‌కు చేరుతుందని అంచనా, సూపర్ హిట్ టాక్ సొంతం
KGF Chapter 2: తొలి మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు, 5 వందల కోట్ల దిశగా కేజీఎఫ్ ఛాప్టర్ 2

KGF Chapter 2: పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 భారీ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలి మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు వసూలు చేసి..ఇప్పుడు 5 వందల కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమౌతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా భారీ కలెక్షను వసూలు చేస్తోంది. హిందీ వెర్షన్ అయితే తొలి మూడ్రోజుల్లో వందకోట్లు వసూలు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 3 వందల కోట్లు వసూలు చేసిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా ఇప్పుడు వీకెండ్‌లోగా 5 వందల కోట్ల క్లబ్ చేరేందుకు సిద్దమౌతోంది. 

ప్రశాంత నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాహుబలి 2 , దంగల్ సినిమాల్లానే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలవనుంది. ప్రముఖ ట్రేడ్ ఎక్స్‌పర్ట్ తరన్ ఆదర్శ్ ప్రకారం  ఈ సినిమా నాలుగు రోజుల్లో 185 కోట్లకు చేరుకోనుంది. ఇప్పటికే  ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా పేరు తెచ్చుకుని తొలిరోజే ట్రెండింగ్‌లో నిలిచింది. యాక్షన్, మసాలాతో నిండిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డు బద్దలు కొట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా 165.37 కోట్లు వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 తరువాత ఇదే అత్యధికమని మరో ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయాబాలన్  వెల్లడించారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2లో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదని అంటున్నారు సినీ విశ్లేషకులు. యశ్ అద్భుత యాక్షన్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఊహించినదానికంటే ఎక్కువ హిట్ దిశగా దూసుకుపోతోంది. 

Also read: Naga Srinu vs Mohan babu: నన్ను ఇక విడిచిపెట్టరా.. మోహన్ బాబుపై నాగ శ్రీను సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News