Hero Ram Pothineni Injured: గాయపడ్డ హీరో `రామ్ పోతీనేని`...`రాపో19` షూటింగ్ కు బ్రేక్!
ఎనర్జిటిక్ హీరో రామ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళ డైరెక్టర్ లింగుస్వామి సినిమాలో హీరోగా నటిస్తున్న రామ్ `రాపో19` పాత్రకు తగిన విధంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జిమ్ వర్కౌట్స్ చేస్తుండగా గాయపడ్డారని సమాచారం.
Hero Ram Pothineni Injured in Gym: టాలీవుడ్ (Tollywood)లో తనదైన ప్రత్యేక శైలితో ఆడియన్స్ ను ఆకట్టుకొని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో 'రామ్ పోతీనేని' (Ram Pothineni). ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న 19 సినిమా 'రాపో19' (RaPo19)షూటింగ్ జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి తమిళ డైరెక్టర్ లింగుస్వామి (Tamil Director Lingusamy) దర్శకత్వం వహిస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే.
ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాను రామ్ అభిమానులు 'రాపో19' గా పిలుస్తున్నారు. రాపో19 సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ 'కృతి శెట్టి హీరోయిన్'గా (Uppena Movie Fame Krithi Shetty) నటిస్తోంది. అంతేకాకూండా ఈ సినిమాలో కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ఆర్య (Aarya) విలన్ గా నటించటం మరో విశేషం.
Also Read: Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదు
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా లింగుసామికి డైరెక్టర్ గా తెలుగులో ఆరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా హీరో రామ్ కు గాయాల పాలయ్యినట్టు తెలుస్తుంది.
సినిమాలో పాత్రకు తగినట్టు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జిమ్ లో చాలా సమయం కష్టపడుతున్నాడు హీరో రామ్. ఇలా అధికంగా వర్కౌట్ లు చేయటం కారణంగా హీరో రామ్ (Hero Ram) మెడకు బలమైన గాయం అయినట్టు తెలుస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదని, హీరో రామ్ త్వరలోనే కోలుకొని మన ఎందుకు వస్తాయని ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. హీరో రామ్ పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ లో పాల్గొనరని చిత్ర యూనిట్ తెలిపింది.
Also Read: Aryan Khan Arrest: 'నా కొడుకు ఏదైనా చేయొచ్చు'.. షారుక్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్
ఈ విషయం హీరో రామ్ సన్నిహితులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే, మెడకు పట్టి పెట్టుకొని హీరో రామ్ కనపడుతున్నారు. ఏది ఏమైనా త్వరగా హీరో రామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook