Aryan Khan Arrest: 'నా కొడుకు ఏదైనా చేయొచ్చు'.. షారుక్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. కొన్ని ఏళ్ల  క్రితం షారుక్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతుంది.. అదెందుకో మీరే చూడండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 12:27 PM IST
  • వైరల్ అవుతున్న షారుక్ ఖాన్ పాత ఇంటర్వ్యూ వీడియో
  • తన కొడుకు ఏదైనా చేయొచ్చని చెప్పిన బాలీవుడ్ బాద్ షా
  • తండ్రి చెప్పిందే చేసాడని కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
Aryan Khan Arrest: 'నా కొడుకు ఏదైనా చేయొచ్చు'.. షారుక్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్

Shah Rukh Khan's son Aryan Khan Arrest: పోలీసులకు అందిన సమాచారం మేరకు తీరంలోని క్రూజ్‌ షిప్‌ (Cruise ship)లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీపై దాడులు జరుగపగా మత్తు పదార్థాలను వినియోగించటం, అరెస్ట్ చేసిన వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shahrukh khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) కూడా ఉన్నాడన్న సంగతి మనకు తెలిసిందే. ఆర్యన్ ఖాన్​తో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి కూడా తెలిసిందే!

ప్రస్తుతం పోలీసులు ఆర్యన్ చాటింగ్ పై దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో సిమి గేర్‌వాల్‌ ఇంటర్వ్యూలో భార్య గౌరీ ఖాన్‌తో (Sharukh Khan Wife Gouri Khan) కలిసి షారుక్‌ తన కుమారుడిపై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Also Read: Rumours On Dhawan Second Marriage: శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? సోషల్ మీడియాలో వైరల్

వీడియోలో షారుఖ్ ఖాన్ ఏమన్నారంటే.. " నేను యవ్వనంలో చేయలేని పనులన్నీ నా కొడుకు ఆర్యన్ చేయాలి. అమ్మాయిలతో డేటింగ్, సిగరెట్, సెక్స్ మరియు డ్రగ్స్ ని కూడా తీసుకోవచ్చు. తాను అన్ని రకాలుగా ఎంజాయ్ చేయవచ్చు". షారుఖ్ ఖాన్ సరదాగా మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. షారుక్ సరదాగ చేసిన కామెంట్లు కొడుకు ఆర్యన్ నిజం చేసి చూపాడంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు 

ముంబయి శివారులో జరిగిన ఓ రేవ్‌ పార్టీపై NCB అధికారులు దాడులు చేశారు.  తీరంలోని క్రూజ్‌ షిప్‌ (cruise ship)లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారంటూ సమాచారం రావడంతో శనివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎన్సీబీ (NCB) అధికారులు అధిక మొత్తంలో కొకైన్‌, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఉండటం సంచలనం శృష్టించింది. 

Also Read: MohanBabu: మెగా ఫ్యామిలీ 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తే.. విష్ణును విత్‌డ్రా అవ్వమని చెప్పేవాడిని..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News