Rana vs Ravi Teja: ఐఫా అవార్డులు 2024.. ఈ మధ్యనే దుబాయిలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ఫంక్షన్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కరణ్ జోహార్, బాలకృష్ణ ఇంటర్వ్యూ ఈ అవార్డుల ఫంక్షన్ జరిగిన వెంటనే అందరిని ఆకట్టుకొని తెగ వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ క్రమంలో ఈ అవార్డులకు సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా.. ప్రస్తుతం ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ అవార్డుల ఫంక్షన్ కి ప్రముఖ హీరో రానా, హనుమాన్ తో మంచి విజయం సాధించిన తేజసజ్జా.. యాంకర్స్ గా వ్యవహరించారు. 



వీరిద్దరూ ఎంతో సరదా సరదాగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఇందులో భాగంగా రానా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం రవితేజ అభిమానులను తెగ ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఈ అవార్డుల ఫంక్షన్లో.. రానా అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ.. బచ్చన్ గారు ఈ సంవత్సరం హైయెస్ట్ ఆఫ్ హైయెస్ట్.. లోవెస్ట్ ఆఫ్ లోయస్ట్ చూశారు అన్నారు. అనగా ఎంతో విజయం అలానే అంతటి డిజాస్టర్ చూశారని అర్థం. 


ఇక ఎంతో అద్భుతమైన విజయం కల్కి సినిమాతో చూశారు అని రానా అనగానే…మరి డిజాస్టర్ ఏమిటి అని తేజ అడిగారు. అందుకు సమాధానంగా రానా.. మిస్టర్ అని అన్న వెంటనే..తేజ అర్థమైనట్టు ఓకే ఓకే అనేసారు. అంటే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా అని.. అక్కడ రానా ఉద్దేశం. 


also read: Prabhas: పబ్లిక్ ప్లేస్ లో ప్రభాస్ అలాంటి పని.. ఫ్యాన్స్ సైతం ఫైర్..ఫోటోలు వైరల్!


అక్కడ అసలు ఆ సినిమాకి అమితాబ్ కి అసలు సంబంధం లేకపోయినా.. కేవలం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అని అంత పెద్ద వేదికపై తెలపదానికి మాత్రమే రానా ఇలా మాట్లాడినట్టు అనిపిస్తోందని.. అసలు అక్కడ నాన్నకి అలా అనాల్సిన అవసరం ఏమిటి అని.. రవితేజ అభిమానులు మండిపడుతున్నారు.


 


 



Also read: 8th Pay Commission Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, భారీగా పెరగనున్న జీతాలు, ఎప్పుడంటే


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.