Police files case against Ravi Teja's Mother : మాస్ మహారాజ రవితేజ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హీరో రవితేజ తల్లి (Hero Ravi Teja Mother) భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను రవితేజ (Ravi Teja) తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌ అనే వ్యక్తి ధ్వంసం చేశారంటూ కేసు నమోదు అయింది.


అధికారుల పర్మిషన్ లేకుండా వారు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వసం చేశారంటూ పోలీసులు పేర్కొన్నారు. అందుకే భూపతి రాజ్యలక్ష్మి, సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతం రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి (Bhupathi Rajya Lakshmi) ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై రవితేజ (Ravi Teja) నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.


Also Read : ఆడపిల్ల మానంకు 5 లక్షలు.. ప్రాణంకు 10 లక్షలు ఇస్తారేమో! ఏపీ సీఎంపై మండిపడ్డ వంగలపూడి అనిత!!


ఇదిలా ఉండగా ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఖిలాడీ, రామారావు.. ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలతో రవితేజ చాలా బిజీగా ఉన్నారు. 


Also Read : Tamil Nadu Lock down:తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​- సీఎం అధికారిక ప్రకటన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook