Narudi Brathuku Natana Movie Pre Release Event: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో రూపొందిన మూవీ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఈ నెల 25న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించగా.. సుధీర్ బాబు, దర్శకులు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితిక షెరు తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rythu Bharosa: రైతులకు బంపర్‌ గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఎకరాకు రూ. 7500 జమా..!  


ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ మూవీ ట్రైలర్ చూశానని.. శివ, నితిన్ ప్రసన్న చాలా చక్కగా నటించారని మెచ్చుకున్నారు. తన మూవీలో ఏదైనా మంచి పాత్రలు ఉంటే.. వీరినే రిఫర్ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా ఇండస్ట్రీని నడిపిస్తాయన్నారు. ఈ మూవీ కంటెంట్ చాలా కొత్తగా ఉంటుందన్నారు. అక్టోబర్ 25న అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరారు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. కేవలం ప్యాషన్, డబ్బులుంటే సినిమాల్ని తీయలేమన్నారు. తాను ప్రారంభంలో కొన్ని సినిమాలను నిర్మించానని.. వాటిని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రదర్శించగలిగానని చెప్పారు. ‘నరుడి బ్రతుకు నటన’ మూవీ టీమ్‌ను చూసినప్పుడు తనకు పాత రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. 


దర్శకుడు రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. శివ, నితిన్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదన్నారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్‌లో చూడాలని కోరారు. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. శివ, నితిన్‌లు చక్కగా నటించారని.. ట్రైలర్ తనకు చాలా నచ్చిందన్నారు. వర్షం పడితే వచ్చే మట్టి వాసనలా ఈ సినిమా అనిపిస్తోందని.. అందరూ చూడాలన్నారు. వీజే సన్నీ మాట్లాడుతూ.. ఈ మూవీ ట్రైలర్ చాలా బాగా నచ్చిందని.. కొత్త వాళ్లు చేసిన ఈ ప్రయోగాన్ని అందరూ ఆదరించాలని కోరారు. ఇలాంటి సినిమాలను ఆడియన్స్‌ ఆదరిస్తే.. మరిన్ని కొత్త ప్రయోగాలు చేసేందుకు అందరూ ముందుకు వస్తారని అన్నారు. 


శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని.. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే నేషనల్ అవార్డు కూడా వస్తుందన్నారు. మొదట చిన్న మూవీగా మొదలైందని.. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రావడంతో రూపురేఖలు మారిపోయాయని అన్నారు. నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ఈ మూవీ యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో అందరికీ నచ్చుతుందన్నారు. ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ఈ నెల 25న ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. 


Also Read: Renu Desai: డిప్యూటీ సీఎంను ఫాలో అవుతున్న రేణు దేశాయ్.. ఇంట్లో గణపతి, చండీ హోమం.. పిక్స్ వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.