Mahesh Babu Appreciates Writer Padmabhushan సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాకు మంచి మౌత్ టాక్ వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాను తాజాగా మహేష్‌ బాబు వీక్షించాడు. అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ మేరకు తన గురించి తన అభిమాన హీరో చెప్పిన మాటలు విని, అలా అభిమాన హీరోను చూడటంతో సుహాస్ కంట్లోంచి నీళ్లు వచ్చేశాయట. తాను ఎలా ఎమోషనల్ అయ్యాడో చెబుతూ ట్వీట్ వేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


కలర్ ఫోటో సినిమాతో సుహాస్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తరువాత సుహాస్ మీద అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే కథా బలం ఉన్న సినిమాలనే  ఎంచుకుంటున్నాడు. ఈక్రమంలోనే రైటర్ పద్మభూషణ్ అనే సినిమాను చేశాడు.ఈ సినిమా కూడా క్లిక్ అయింది. క్లైమాక్స్‌లోని ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం క్లైమాక్స్‌ను చూసి కదిలిపోయాడట.


హృదయాన్ని కదిలించింది.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయ్యాను.. ఈ సినిమాను కుటుంబం అంతా కలిసి చూడాల్సిందే.. సినిమాలో సుహాస్ నటన అందరినీ మెప్పిస్తుంది.. అనురాగ్, శరత్‌, ప్రశాంత్ ఇలా సినిమా కోసం పని చేసిన అందరికీ కంగ్రాట్స్ అని మహేష్‌ బాబు ట్వీట్ వేశాడు. మహేష్‌ బాబు తన సినిమాను, తన నటన గురించి మాట్లాడటంతో సుహాస్ ఏడ్చేశాడు.


మహేష్‌ బాబుని అలా చూడటంతోనే కంట్లోంచి నీరు వచ్చిందట. టీం అంతా కూడా ఏమైంది అని అడిగారట. ఏమో తెలియడం లేదు అని తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ గురించి చెప్పకనే చెప్పేశాడు సుహాస్.


Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?


Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి