Deepthi Sunaina New Home: కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌..? దీప్తి సమాధానానికి ముక్కున వేలేసుకున్న నెటిజన్

Deepthi Sunaina Busy New Home: దీప్తి సునయన ఈ మధ్య కొత్తింటిని కొనేసిందట. కొత్తింటికి వెళ్లడంపై నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. ఆ కొత్తింటిని ఎలా కొన్నావ్ అంటూ  నెటిజన్లు అడిగితే.. అదిరిపోయే సమాధానాన్ని ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 12:26 PM IST
  • నెట్టింట్లో దీప్తి సునయన చిట్ చాట్
  • ఫ్యాన్స్‌తో దీప్తి సునయన ముచ్చట్లు
  • కొత్త ఇంటి కొనుగోలుపై ప్రశ్నలు
Deepthi Sunaina New Home: కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌..? దీప్తి సమాధానానికి ముక్కున వేలేసుకున్న నెటిజన్

Deepthi Sunaina Busy New Home: దీప్తి సునయన ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేయడం లేదు. తన పనులతో తాను బిజీగా ఉంటోంది. ఒకప్పుడు అయితే సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండేది. తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలంటూ తిరిగేది. రీల్స్ చేస్తూ ఫుల్ హల్చల్ చేసేది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక షన్నుతో బ్రేకప్ చెప్పాక దీప్తి సునయన తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ కనిపించేది. ఒంటరి తనంగా ఫీల్ అవ్వొద్దనే అలా చేసినట్టుగా అనిపించేది.

దీప్తి సునయన కోసం షన్ను ఇంకా వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ దీప్త సునయన మాత్రం ఇంకా దూరంగానే ఉండాలని అనుకుంటున్నట్టుంది. అందుకే షన్నుని పట్టించుకోకుండా తన పనేదో తాను చూసుకుంటూ బిజీగా ఉంటోంది. వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలంటూ దీప్తి సునయన బిజీగా ఉంది. ఇప్పుడు తన అభిమానులతో దీప్తి సునయన ముచ్చట్లు పెట్టేసింది.

ఇందులో కొత్త ఇంటికి మారిపోయావా? అని ఓ నెటిజన్ అడిగాడు. అవును అని సమాధానం ఇచ్చింది. చెన్నైకి ఎప్పుడొస్తున్నావ్ అని ఇంకో నెటిజన్ అడిగాడు. ఈ నెలలోనే వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ అయితే.. ఆ ఇంటిని ఎలా కొన్నావ్.. డబ్బు ఎక్కడిది అని అడిగేశాడు. దీనికి దీప్తి సునయన మంచి సమాధానం ఇచ్చింది.

నేను సంపాదించిన డబ్బులో ముప్పై శాతం ఖర్చు పెట్టుకున్నా.. డెబ్బై శాతం సేవ్ చేసి పెట్టుకున్నా.. ఆ డబ్బుతోనే కొనుకున్నా అని సమాధానం ఇచ్చి నోరు మూయించింది. అలా దీప్తి సునయన మొత్తానికి తన సొంత డబ్బుతో ఇలా హైద్రాబాద్‌లో ఓ ఇళ్లు కొనేసుకుందన్న మాట. ఈ లెక్కన దీప్తి సునయన బాగానే సంపాదించేస్తోందని అర్థమవుతోంది.

Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News