Chiyaan Vikram Accident హీరో విక్రమ్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తంగళన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు ఇప్పుడు బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది. షూటింగ్ సమయంలోనే విక్రమ్‌కు గాయాలయ్యాయ్ అని తెలుస్తోంది. ఆయన పక్కటెముకల విరిగాయని, ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టుగా సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ జివి ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో తంగళన్‌లో పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి, హరి, బ్రిటిష్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్  వంటి వారు నటించారు. ఈ మూవీ షూటింగ్‌ గతేడాది ప్రారంభమై శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య విక్రమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అసలు అది విక్రమేనా? అనేట్టుగా అందరూ నోరెళ్లబెట్టేశారు.


అలా తాను నమ్మిన ఓ కథ కోసం ఇలా పూర్తిగా ప్రాణం పెట్టేస్తాడు. గుర్తు పట్టనంతగా మారిపోతాడు. అయితే ఇప్పుడు తంగళాన్ సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడ్డాడు. తంగళన్ కోసం రిహార్సల్ చేస్తున్నప్పుడు పక్కటెముక విరిగిందని తెలుస్తోంది. ఆయనకు చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.


Also Read:  Malavika Mohanan : ఆ పార్ట్ మీదే ఫోకస్.. అద్దం ముందు మాళవిక అందాల ప్రదర్శన


ఇలా పక్కటెముకలు విరగడంతో కొన్ని రోజుల పాటు బెడ్డుకు పరిమితం కానున్నాడు. దీంతో తంగళన్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారట. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత విక్రమ్ మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని  తెలుస్తోంది. అయితే విక్రమ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇలా ప్రమాదానికి గురి కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇలానే ఆయన స్వల్ప అస్వస్థతతో హాస్పిటల్లో చేరితే.. మీడియా పెద్ద రాద్దాంతం చేసింది. తీవ్ర అనారోగ్యం అని వార్తలు రాసింది. దీనిపై విక్రమ్ కూడా సెటైర్లు వేశాడు. తనకేమీ సీరియస్‌గా లేదని, మీడియా ఆందోళన పడొద్దని, అభిమానులు కంగారు పడొద్దని విక్రమ్ సూచించిన సంగతి తెలిసిందే.


Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook